ఏపీలో బీజేపీ వ్యాప్తి కోసం ఇదీ జేపీ నడ్డా ఫార్ములా?

ఏపీలోనూ సత్తా చాటాలని బీజేపీ ఊవ్విళ్లూరుతోంది. గతంలో టీడీపీతో పొత్తు ఉన్నప్పుడు మూడు, నాలుగు అసెంబ్లీ సీట్లు, ఒకటి, రెండు ఎంపీ సీట్లు సాధించిన సంగతి తెలిసిందే. కానీ.. గత ఎన్నికల్లో ఏపీలో బీజేపీకి అసలు ఏ సీటూ దక్కలేదు. కానీ.. ఈసారి సత్తా చాటాలంటున్నారు ఆ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిన జేపీ నడ్డా.. పార్టీ నాయకులకు సక్సస్ ఫార్ములా బోధించారు.

సర్వ వ్యాప్తి సర్వ స్పర్శి అన్నది మన లక్ష్యం కావాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ శ్రేణులకు బోధిస్తున్నారు. అన్ని వర్గాలూ ఈ పార్టీ తమది అనుకోవాలని.. అపుడే పార్టీ వ్యాప్తి జరుగుతుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పుకొచ్చారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన మొదలు అన్ని పథకాలూ జగన్ సర్కారు  పేర్లు మార్చి స్వంతం చేసుకుంటోందని ఈ విషయాన్ని జనంలోకి బాగా తీసుకెళ్లాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచించారు.

ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఏపీలో జగన్ ఆరోగ్యశ్రీగా మార్చేశారని.. ఆయుష్మాన్ భారత్ ఎక్కడైనా పని చేస్తుందని.. ఆరోగ్యశ్రీ రాష్ట్రం దాటితే పనికి రాదని ఆ విషయాన్ని ప్రజలకు వివరించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అంటున్నారు. ఆరోగ్య శ్రీ హైదరాబాదులో చెల్లదనీ, ఇది లబ్ధిదార్లకు నష్టదాయకమన్న విషయాన్ని ప్రజలకు విడమరచి చెప్పాలని సూచించారు.

పార్టీని ఏపీలో విజయవంతం చేయటానికి సమావేశాలు ఏర్పాటు చేసుకోవటం శుభప్రదమన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా... విజయవాడ అర్జునుడు తపస్సు చేసిన పుణ్యస్థలం అంటూ చెప్పుకొచ్చారు. దేశం వంక శత్రువు కన్నెత్తి చూడటానికి భయపడేలా దేశాన్ని సర్వసన్నద్ధంగా ఉంచుకోవటం మన లక్ష్యమని.. ఈ విషయాన్ని పార్టీ శ్రేణులు జనంలోకి తీసుకెళ్లాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచించారు. దేశాన్నిబలోపేతం చేసుకోవటానికి ప్రతి ఒక్కరూ సంసిద్ధంగా ఉండాలని.. ఏపీలో పదివేలకు మించి ఉన్న శక్తి కేంద్రాలను సరిగ్గా ఉపయోగించుకోవాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: