ఇవాళ, రేపు మహానాడు.. టీడీపీ ఫ్యాన్స్‌కు పండుగే!
మొదట ఇటీవల మరణిం చిన పార్టీ కార్యకర్తలు, నాయకులకు సంతాప తీర్మానం ప్రవేశపెడతారు. ఉదయం 11.45 కి చంద్రబాబు ప్రారంభోపన్యాసం ఉంటుంది. ఆ తర్వాత తర్వాత తీర్మానాలపై చర్చ ప్రారంభం అవుతుంది. ఇక ఈ రాత్రి 8 గంటలకు అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది. ఆ తర్వాత ఇవాళ్టి కార్యక్రమం చంద్రబాబు ముగింపు ఉపన్యాసంతో ముగుస్తుంది. రేపు ఎన్టీ ఆర్ జన్మదినోత్సవం సందర్భంగా తెలుగుదేశం నేతలు ఘనంగా నివాళులర్పిస్తారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ప్రారంభిస్తారు. రేపు మధ్యాహ్నం మండువారిపాలెంలో భారీ బహిరంగ సభ ఉంటుంది. ఈ సభతో మహానాడు ముగుస్తుంది.
ఈ మహనాడులో చర్చించే అంశాలపై నిన్న టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించుకుంది. ఇవాళ మహానాడులో ప్రవేశ పెట్టే తీర్మానాలపై టీడీపీ చర్చించింది. మహానాడు తీర్మానాలకు తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో ఆమోదం తెలిపింది. ఈ మీటింగ్‌లో మహానాడు ప్రతినిధుల సభలో 17 తీర్మానాలు ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. ఈ మొత్తం 17 తీర్మానాల్లో ఏపీకి 12 తీర్మానాలు, తెలంగాణకు 3 తీర్మానాలు, అండమాన్ కు ఒక తీర్మానం ఉంటాయి.
ఈ మహానాడులో ప్రవేశ పెట్టే రాజకీయ తీర్మానాలపై నిన్ననే పొలిట్ బ్యూరోలో కూలంకషంగా చర్చించారు. ఈ తీర్మానాల్లో ఏపీకి ప్రాధాన్యత దక్కింది. తెలంగాణలో తెలుగు దేశం పార్టీ పూర్తిగా నిరాశజనకంగా ఉంది. అందుకే ఏదో నామ్ కే వాస్తేగా మూడు తీర్మానాలు ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నారనిపిస్తోంది.