అడిగే నోరు..: జనం నుంచి జగన్ వరకూ ... !

RATNA KISHORE
అడిగే నోరు ఎలా ఉండాలి
అడిగే నోటి నుంచి వచ్చే పదాలు
ఎలా ఉండాలి
ఇంత కాలం సంయమనంతో ఉన్నారే!
ఇకపై  కూడా ఇదే విధంగా ఉంటారా?
పలుకు బంగారం అయితే మౌనం ఏమౌతుంది. పలుగు బంగారం అయితే ప్రశ్న ఏమౌతుంది. అడిగాక లేదనిపించుకోవడం జరిగే పని కాదు. జనం ఏమడుగుతారు. మా ఊ రి గురించి మా ప్రాంతం గురించి జగన్ ఎదురయితే వచ్చే ప్రశ్నలేంటి.. మా ఊరు అంటే శ్రీకాకుళం, మా ప్రాంతం అంటే విజయనగరం వీటిపై వచ్చే ప్రశ్నలు .. ఇదే ఇవాళ్టి అడి గే నోరు..మరి! పెట్టే చేయి ఏం చెబుతుంది?
నీటి తగాదాలు
వంశధార తోటపల్లి
ప్రాజెక్టుల నిర్వహణ ఇవే కీలకం
చాలా కాలం తరువాత జగన్ సర్ ఇటుగా వస్తున్నారు. తన సెంటిమెంట్ శ్రీకాకుళం కనుక అక్కడి నుంచి స్టార్ట్ అవుతారా? రచ్చ బండ పేరిట ఆయనేం చెబుతారు? గ్రామా ల్లో నిద్ర సందర్భంగా ఏం మాట్లాడుతారు? అన్న ఆసక్తులతో పాటు జనం తరుఫు నుంచి వచ్చేవి ఏంటి? పూలే రాలుతాయా? ముళ్లే గుచ్చుకుంటాయా? మా ప్రాంతం అన గా శ్రీకాకుళం నుంచి సాగునీటి ప్రాజెక్టులు, ముఖ్యంగా ఒడిశాతో నీటి తగాదాలు ఇవి పరిష్కరించేందుకు ఏం చొరవ తీసుకుంటారు. ఇదొక్కటీ పరిష్కారం కావాలి. ఒడిశా కు సంబంధించి వచ్చిన లేదా రేగిన అభ్యంతరాలు వంశధార నీటి విషయమై నేరడి బ్యారేజీ నిర్మాణం వీటిపై ఏం తేలుస్తారు?ఇదీ నా ఆసక్తి. మిగతావి ప్రాముఖ్యం అయినా ఇదే ప్రధానం.
వ్యవసాయ వర్శిటీ ఒకటి వస్తే మేలు
గిరిజన విద్యాలయం లెక్క తేల్చండి
ఇక నా ప్రాంతం.. నా ఉనికికి కొనసాగింపు విజయనగరం ఈ ఊరు..బొత్సది.. కానీ ఇప్పటికీ ప్రతిపాదిత గిరిజన విశ్వ విద్యాలయం పనులు ఒక పట్టాన తేలడం లేదు. భోగా పురం విమానాశ్రయం గొడవ లేదు అంటే ఒప్పుకోం కానీ దీనికి సంబంధించి భూ సేకరణ తగాదాలు ఎలా ఉన్నాయి..వాటి పరిష్కారం ఏంటన్నది చెప్పాలి.. మూడో ఊరు వి శాఖ. లేటరేట్, బాక్సైట్ తవ్వకాలు, స్థానికంగా ఎప్పటి నుంచో ఉన్న వ్యతిరేకతపై ఆయన మాట్లాడే మాటలే కీలకం..వీటితో పాటూ ఇంకొన్ని.. వీటిపై జనం నుంచి ప్రశ్నలు వస్తాయి సర్.. మీరు మాట్లాడాలి మాట్లాడండి ప్లీజ్ ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: