ఇక పెళ్లి కానీ జంటలకు ఓయో షాక్.. ? రూల్స్ మార్చారుగా..!

Chakravarthi Kalyan

హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో కొత్త స్టార్టప్ అయిన ఓయో షాకింగ్, కీలక ప్రకటన చేసింది. కంపెనీ తన చెక్-ఇన్ నిబంధనలను మార్చింది. కంపెనీకి అనుబంధించబడిన హోటళ్లలో దీన్ని అమలు చేయాలని కోరింది.ఓయో కొత్త నిబంధనల ప్రకారం.. పెళ్లికాని జంటలు ఇకపై గదులను బుక్ చేసుకోలేరు. హోటల్ బుకింగ్ కంపెనీ ఓయో భాగస్వామి హోటల్‌ల కోసం చెక్-ఇన్ నిబంధనలను సవరించింది, పెళ్లికాని జంటలు ఇకపై చెక్-ఇన్ చేయలేరని, ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ నియమం వర్తిస్తుందని పేర్కొంటూ కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది.


చెక్-ఇన్ సమయంలో అన్ని జంటల నుండి వారి సంబంధానికి చెల్లుబాటు అయ్యే రుజువు కోసం అంటే పెళ్లయిన వారైతే మ్యారేజ్ సర్టిఫికెట్ లాంటివి అడగమని కంపెనీ తన భాగస్వామి హోటల్‌లను కోరింది. ఓయో భాగస్వామి హోటల్‌ల ఆన్‌లైన్ బుకింగ్‌కు కూడా ఈ నియమాలు వర్తిస్తాయి. అయితే, తమ సామాజిక పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే హక్కును కూడా ఓయో హోటళ్లకు కల్పించింది. అంటే కంపెనీ భాగస్వామ్య హోటళ్లు తమ నిబంధనలను అమలు చేయగలవు.


ప్రస్తుతం మీరట్‌లోని ఓయో హోటల్‌లకు వర్తిస్తుంది. అయితే నివేదిక ప్రకారం, కంపెనీ ఇక్కడి నుండి సరైన అభిప్రాయాలను పొందినట్లైతే ఇతర నగరాల్లో కూడా ఈ నియమాన్ని అమలు చేయడాన్ని పరిశీలిస్తుంది. పెళ్లికాని జంటలకు హోటళ్లు ఇవ్వొద్దని మీరట్‌ ప్రజలు విజ్ఞప్తి చేసినట్లు ఓయో తరఫున తెలిపారు. దీంతో పాటు దేశవ్యాప్తంగా అనేక పిటిషన్లు కూడా దాఖలయ్యాయి.


ట్రావెల్ బుకింగ్ సంస్థ, పాత అవగాహనలను మార్చడం, కుటుంబాలు, విద్యార్థులు, వ్యాపారాలు, మతపరమైన ప్రయాణికులు, ఒంటరి ప్రయాణీకులకు సురక్షితమైన అనుభవాలను అందించే బ్రాండ్‌గా తమను తాము మెరుగు పరుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఓయో పేర్కొంది . ఎక్కువ కాలం హోటల్స్ లో స్టే చేయడం, రిపీట్ బుకింగ్‌లను ప్రోత్సహించడం కూడా తమ లక్ష్యం అని కంపెనీ తెలిపింది. ఇటీవలే ట్రావెల్ పీడియా 2024 నివేదిక విడుదల చేయబడింది. ఇందులో ఓయో హోటల్‌లను బుక్ చేసుకోవడానికి సంబంధించిన సమాచారం పేర్కొంది. నివేదిక ప్రకారం, పెళ్లికాని జంటలు ఓయో ద్వారా ఎక్కువ గదులు బుక్ చేసుకోగా, వారిలో తెలంగాణ యువత ఓయో సర్వీసును ఎక్కువగా ఉపయోగించుకున్నారని పేర్కొంది.  ఇలాంటి పరిస్థితుల్లో ఓయో తీసుకున్న ఈ నిర్ణయం తన వ్యాపారంపై ఎంత ప్రభావం చూపుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: