ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ సీఎం? ఆశీర్వాదం కోసమే బాబుని కలిశారా?

frame ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ సీఎం? ఆశీర్వాదం కోసమే బాబుని కలిశారా?

Chakravarthi Kalyan

వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డిని తొక్కేయాలని చంద్రబాబు భావిస్తున్నారా? పొలిటికల్ గా దెబ్బ తీయాలనే ఆలోచన చేస్తున్నారా? ఎట్టి పరిస్థితుల్లోను పుంగనూరులో ఈ కుటుంబం గెలవకూడదు అని నిర్ణయానికి వచ్చారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మాజీ సీఎం కిరణ్‌ కుమార్ రెడ్డి ద్వారా పెద్దిరెడ్డికి చెక్ పెట్టాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.


హైదరాబాద్ లో ఆదివారం సీఎం చంద్రబాబు తో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గంట పాటు సమావేశం అయ్యారు. చాలా లోతుగా చర్చించుకున్నట్లు తెలుస్తోంది. పెద్దిరెడ్డి హవా గత ఐదేళ్లు నడిచింది. పెద్ది రెడ్డి తీరుతో ఇటు చంద్రబాబు, అటు కిరణ్ కుమార్ రెడ్డిలు ఇద్దరూ అసౌకర్యానికి గురయ్యారు. చాలా రకాల ఇబ్బందులు పడ్డారు. ఆ ఇద్దరు నేతల ఉనికిని ప్రశ్నార్థకం చేయడానికి పెద్ది రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేశారు.


అందుకే ఇప్పుడు ఆ ఇద్దరు నేతలు వ్యూహాత్మకంగా కలిసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీ ఎమ్మెల్యేగా కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు ఉన్నారు. ప్రస్తుతం కిరణ్‌ బీజేపీలో కొనసాగుతున్నారు. మెన్నటి ఎన్నికల్లో రాజంపేట నుంచి పోటీ చేసి పెద్ది రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇక కిరణ్ కుమార్ రెడ్డి కి బీజేపీ అధిష్ఠానం ఎనలేని ప్రాధాన్యం ఇస్తోంది.


ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెడుతుందనే విశ్లేషణలు మొదలు అయ్యాయి. బీజేపీ చీఫ్ గా పురంధేశ్వరి ని తప్పించి.. ఆమె స్థానంలో కిరణ్ కుమార్ రెడ్డి ని కూర్చోబెట్టాలని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో చంద్రబాబుతో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ కావడం ఎనలేని ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక కిరణ్ కుమార్ రెడ్డి రాజ్యసభ కోసం ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.  అందుకే చంద్రబాబుని కలిసి తన రాజకీయ భవిష్యత్తుపై చర్చించారనే టాక్ కూడా ఉంది.  మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: