జగన్ కి తెలిసి వచ్చిందా? వారికే ప్రాధాన్యం అంటూ తేల్చేశారుగా
మాజీ సీఎ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ బలోపేతం దిశగా తన లక్ష్యాన్ని స్పష్టం చేశారు. పార్టీలో కింది స్థాయి కేడర్ కే ప్రాధాన్యం ఉంటుందని తేల్చి చెప్పారు. పార్టీని దేశంలోనే అత్యంత బలమైన తీర్చి దిద్ది కార్యక్రమం ప్రారభించామని వెల్లడించారు. రానున్న రోజుల్లో మరిన్ని కీలక నిర్ణయాలు ఉంటాయని వెల్లడించారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ అధినేత జగన్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులతో సమావేశం అయ్యారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ఇప్పటి వరకువిఫలమైందని విమర్శించారు. ఏ ఒక్క హామీ దిశగా ఆలోచన చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని వ్యాఖ్యానించారు. దేవుడికి ఆగ్రహం తెప్పించే విధంగా వారి పాలన సాగుతోందని మండి పడ్డారు. నాలుగు నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని జగన్ చెప్పుకొచ్చారు.
రైతులకు ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయడం లేదన్నారు. అన్ని అంశాల్లోను పాలన కుప్పకూలిందని జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన తెచ్చారని తప్పుడు కేసులు పెడతున్నారని ఆరోపించాఉ. లా అండ్ ఆర్డర్ ఎక్కడా అమలు కావడం లేదన్నారు. పారదర్శకత లేదన్నారు. విజయవాడ వరద భాధితులకు సాయం అందడం లేదన్నారు. ప్రజలను డైవర్ట్ చేయడానికే కొత్త టాపిక్స్ తెరపైకి తెస్తున్నారని చెప్పారు.
పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ప్రాధాన్యం ఉంటుందని జగన్ వెల్లడించారు. తాను కేవలం పార్టీ ప్రతినిధిని మాత్రమే అని చెప్పుకొచ్చారు. పార్టీలో కష్టపడే వారికే ప్రాధాన్యం ఉంటుందని.. ఆ ప్రక్రియలో నష్టపోయిన వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. క్షేత్ర స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తామని చెప్పుకొచ్చారు. దేశంలోనే బలమైన పార్టీగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని మొదలు పెట్టామన్నారు. పార్టీ కోసం ఎంతో మంది మద్దతుగా నిలిచారన్నారు. వీరిని పార్టీ వ్యవస్థల్లోకి తీసుకు రావాలని సూచించారు. ప్రజల తరఫున పోరాటాల్లో చురకుగా ఉండాలని జగన్ పిలుపునిచ్చారు.