ట్రంప్‌కు మస్క్‌ విరాళాల వెనుక అంత సీక్రెట్‌ ఉందా?

Chakravarthi Kalyan
ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అయిందంటే చాలు. నేతల చేసే ఖర్చులకు అంతే ఉండదు. విందు, వినోదాలు, మద్యం, కానుకలు ఇలా అన్ని మార్గాల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నిస్తుంటారు. ఈ ఖర్చు మన దగ్గరే కాదు. అమెరికాలో కూడా ఉంది. కాకపోతే అమెరికా అభివృద్ధి చెందిన దేశం కాబట్టి అభ్యర్థులు ఇచ్చే తాయిలాలు మరో విధంగా ఉంటాయి.

మొన్నటి ఎన్నికల్లో మన దేశంలో ఎలక్టోరల్ బాండ్స్ చర్చకు కారణమైనట్టే ప్రస్తుతం అమెరికాలో రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ కోసం ప్రఖ్యాత వ్యాపారవేత్త, ప్రపంచ ధనికుడు భారీగా ఖర్చు చేస్తానని ప్రకటించారు. దీంతో ఇది అమెరికా వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశం అయింది. అక్కడ నవంబరులో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి కూడా రిపబ్లికన్ పార్టీ నుంచి మాజీ అధ్యక్షుడు ట్రంప్.. డెమొక్రటిక్ నుంచి కమలా హారిస్ బరిలో నిలిచారు.

ఇప్పటికే ట్రంప్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. వరుసగా జరిగిన డిబెట్లలో ప్రస్తుత అధ్యక్షుడు వెనుకబడటంతో ఆయన పోటీ నుంచి తప్పుకొని కమలా హారిస్ ని తన వారసురాలిగా ప్రకటించారు. దీంతో అమెరికా రాజకీయం రసవత్తరంగా మారింది. మరోవైపు క్రమంగా ట్రంప్ కు మద్దతు క్రమంగా పెరుగుతోంది. అక్కడ విడుదల అయిన పలు సర్వేలు ట్రంప్ కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతోంది. ఈ క్రమంలో మస్క్ సంచలన ప్రకటన చేశారు.

ట్రంప్ కి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ట్రంప్ ను గెలిపించేందుకు భారీ ఎత్తున నిధులు సమకూర్చేందుకు మస్క్ సిద్ధం అయ్యారు. నవంబర్లో ఎన్నికలు జరిగే వరకు ప్రతి నెలా దాదాపు 45 మిలియన్ డాలర్లు.. అంటే రూ.376 కోట్లు ఇచ్చేందుకు మస్క్ ప్రణాళికలు రూపొందించాడు. గతంలో ఎవరికి ఆర్థిక సాయం చేయనని ప్రకటించిన.. ఆయన మనసు మార్చుకొని ట్రంప్ కోసం పని చేయనున్నారు. ఇదే సమయంలో మస్క్ గురించి ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. మస్క్ అద్భుతమైన వ్యక్తి అని.. విరాళం ఇస్తున్నందుకు ఆయన్ను అభినందిస్తున్నారని బహిరంగ డిబెట్లో  పొగిడారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: