అప్పులు చేయడంలో చంద్రబాబు కూడా తగ్గేదే..లే?

Chakravarthi Kalyan
జగన్ అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేశారని ఆది నుంచి టీడీపీ ఆరోపిస్తూ వస్తోంది. ఎన్నికల సమయంలో ఇదే అంశాన్ని ప్రధాన అస్త్రంగా తీసుకొని ప్రచారం నిర్వహించింది. ఎన్నికల సమయంలోను అప్పులు చేసి పింఛన్లు ఇచ్చారని కూటమి నేతలు బాగా ప్రచారం చేశారు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టారంటూ.. చివరకు సచివాలయాన్ని కూడా వైసీపీ వదల్లేదు అంటూ  చంద్రబాబు విమర్శలు గుప్పించారు.

సీన్ కట్ చేస్తే ఫలితాలు వెలవడ్డాయి. ప్రభుత్వం మారింది. అధికారం వైసీపీ నుంచి టీడీపీ కూటమి చేతుల్లోకి వచ్చింది.  టీడీపీ పాలన చేపట్టి నెల రోజులు కావొస్తుంది. ఈ నెల రోజుల కాలంలో కూటమి ప్రభుత్వం అప్పులు చేయలేదా అంటే.. కచ్ఛితంగా కాదు.  అప్పు చేయకుండా ప్రభుత్వాలను నడపడం అంత తేలికైన విషయం కాదనేది ఆర్థిక విశ్లేషకుల వాదన.  

తెలంగాణకు అతి పెద్ద ఆర్థిక వనరు హైదరాబాద్. అయినా కూడా ఆ రాష్ట్రం అప్పులమయంగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో ప్రకటించారు. అయితే అప్పులు చేయడం సర్వసాధారణం. దేశంలో అప్పులు చేయని రాష్ట్రం లేదు. ప్రపంచంలో అప్పు చేయని దేశం లేదు. అయితే వీటిని దేనిపై ఖర్చు పెడుతున్నారు అనే దానిపై చర్చ జరగాలి. ఇవన్నీ పక్కన పెడితే.. అప్పుల ప్రభుత్వంగా గత ప్రభుత్వాన్ని చీల్చి చెండాడిన కూటమి నేతలు ఇప్పుడు అప్పులు చేసేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఏపీలోని కూటమి ప్రభుత్వం తాజాగా రూ.2000 కోట్లను అప్పు తీసుకున్నారు.  ఇప్పుడు మరో రూ. 5200 కోట్లు అప్పు తీసుకునేందుకు రెండు శాఖలకు అనుమతి ఇచ్చింది. మార్క్ ఫెడ్, సివిల్ సప్లై ద్వారా ఈ అప్పులు తీసుకునేందుకు గ్యారంటీ ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది. గతంలో వైసీపీ కూడా అదే చేసింది. కానీ దానిని ఓ బూచీలాగా ప్రెజెక్ట్ చేసి ఇప్పుడు దానిని సమర్థిస్తూ ఎల్లో మీడియా కథనాలు రాస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: