బీజేపీలో ముసలం.. మోదీ, అమిత్‌షా మధ్య చిచ్చు ఎక్కడకు దారి తీస్తుందో?

Chakravarthi Kalyan
కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారు అన్నది తెలియడం లేదు. ఉత్తరాదిన బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఇండియా కూటమి నేతలు అదే పనిగా చెబుతున్నారు. ఇక ఖర్గే అయితే ఆ పార్టీకి 200 సీట్లు మించి రావని స్పష్టం చేశారు. యూపీకి చెందిన అఖిలేశ్ యాదవ్ కూడా మొత్తం 80 సీట్లలో 79 స్థానాలను గెలవబోతున్నాం అంటూ ధీమా వ్యక్తం చేశారు.

ఇక వీరు చెప్పారు అని కాదు కానీ.. దేశంలో బీజేపీకి అంతగా సానుకూల పవనాలు వీచడం లేదనేది అయితే సుస్పష్టం. బీజేపీ వస్తే రాజ్యాంగ రద్దు చేస్తుందని ఇండియా కూటమి నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో వాటిని తిప్పికొట్టే పనిలో బీజేపీ ఉండగా.. అనుకోకుండా జైలు నుంచి విడుదల అయ్యారు దిల్లీ సీఎం కేజ్రీవాల్. జైలు నుంచి వస్తూ వస్తూనే పెద్ద బాంబ్ పేల్చారు.

బీజేపీ పార్టీ రాజ్యాంగం ప్రకారం మోదీకి 75 ఏళ్లు వచ్చే ఏడాది నిండుతాయని.. అమిత్ షా ని ప్రధాని చేసేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు కేజ్రీవాల్. దీంతో ఒక్కసారిగా ఎన్డీయే కూటమి ఆత్మరక్షణలో పడింది. దీంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షానే 2029 వరకు మోదీయే ప్రధాని అని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అయితే ఈ తరహా వ్యాఖ్యలు వ్యూహంలో భాగమే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రధాని మోదీ, అమిత్ షా ల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నంగా వారు అభివర్ణించారు. 2019లో కూడా నితిన్ గడ్కరీ ని ప్రధాని అభ్యర్థిగా నాటి యూపీఏ నేతలు పేర్కొన్నారు. ఈ ప్లాన్ విఫలం అయింది. ఇప్పుడు మరోసారి ఇదే వ్యూహాన్ని షా రూపంలో వదిలారు ఇండియా కూటమి నేతలు. అయితే వీరిద్దరి మధ్య  మనస్పర్థలు వచ్చే అవకాశం లేదని కొంతమంది పేర్కొంటున్నారు. పార్టీ నిర్మాణం కోసం ఈ ద్వయం అహర్నిషలు కృషి చేశారు. పార్టీని బలీయ శక్తిగా మార్చారు. వీరిద్దరి మధ్య ఎంత చిచ్చు పెట్టినా అది ప్రయోజనం ఉండదనే విషయం కేజ్రీవాల్, ఇండియా కూటమి నేతలకు అర్థం కావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: