అసలు రహస్యం: ఇక్కడ గెలిస్తే.. ఎన్నికలు గెలిచినట్టే?

Chakravarthi Kalyan
కొన్ని ప్రత్యేక పరిస్థితులను ఆధారం చేసుకొని ఎన్నికలు జరుగుతూ వస్తున్నాయి. పేపర్ల ఆధారంగా ఒక ఎన్నిక జరిగితే.. టీవీలను బేస్ చేసుకొని మరో ఎన్నిక జరిగింది. ఈ సారి ఎన్నిక  మాత్రం సోషల్ మీడియాని నమ్ముకొని జరుగుతున్నాయి. ఈ సారి రాజకీయ పార్టీల గెలుపు ఓటముల్లో సోషల్ మీడియా గణనీయమైన ప్రభావం చూపుతుంది అని చెప్పడంలో సందేహం లేదు.

అందుకే రాజకీయ పార్టీలు కూడా సోషల్ మీడియానే ఎక్కువగా నమ్ముకొని ప్రచారం చేస్తోంది. పదేళ్లుగా దేశాన్ని ఏలుతున్న బీజేపీ సోషల్ మీడియాలో కూడా రాజ్యమేలుతోంది. ఇన్ స్టాగ్రాం, యూ ట్యూబ్ లో కొత్త యూజర్లను ఆకట్టుకోవడంలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ముందు వరుసలో ఉన్నాయి. ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో మూడో అతి పెద్ద పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ కు పెద్దగా సోషల్ మీడియా ప్రాతినిథ్యం లేకపోవడం విశేషం. ఇందులో ఏ పార్టీ ఎంతమంది ఫాలోవర్లను కలిగి ఉందో పరిశీలిస్తే..

పార్టీల ఫాలోవర్లను పరిశీలిస్తే బీజేపీ తన ఎక్స్ ఖాతాకు గత మూడు నెలల నుంచి 4లక్షలకు పైగా  యూజర్లు జై కొట్టారు. కాంగ్రెస్ 2.37లక్షల మందిని ఫాలోవర్లను సాధించింది. ఆప్ కు 12వేల మంది యూజర్లు దక్కారు. ఈ సోషల్ వేదికలో బీజేపీకి ఏకంగా 2.18కోట్ల మంది ఫాలోవర్లు ఉండగా.. కాంగ్రెస్ కు 1.04 కోట్లు, ఆప్ ను 65 లక్షల ఎక్స్ యూజర్లు ఫాలో అవుతున్నారు.

ఇక యూట్యూబ్ ఛానళ్ల విషయానికొస్తే బీజేపీ యూ ట్యూబ్ ఛానల్ కి 58.2లక్షల మంది సబ్ స్కైబర్లతో 41వేల వీడియోలతో టాప్ లేపుతోంది. కాంగ్రెస్ కు 44.8లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. వ్యక్తిగతంగా మోదీని ఎక్సులో  9.73 కోట్లమంది ఫాలో అవుతున్నారు. రాహుల్ గాంధీ యూజర్ల సంఖ్య కేవలం 2.54 కోట్లు మాత్రమే. ఇన్ స్టాలోను మోదీ కి పెద్ద సంఖ్యలోనే అభిమానులున్నారు. ప్రధాని కి ఏకంగా 8.85 కోట్లమంది ఫాలోవర్లు ఉండగా.. రాహుల్ కి 68లక్షల మంది ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: