మళ్లీ భారీ మెజార్టీతో జగనే.. తేల్చిన కొత్త సర్వే?

Chakravarthi Kalyan
రానున్న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల నాడి ఎలా ఉంటుందనే విషయంపై ఇప్పటికే దాదాపు అన్ని జాతీయ సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. అదే విధంగా ప్రముఖ ఆంగ్ల దినపత్రిక టౌమ్స్ నౌ ఈటీజీ మరో సర్వే నిర్వహించింది. ఈసారి అధికారం ఎవరికి రాబోతుందో అంచనా వేసింది.

ఈ సంస్థ డిసెంబరు 13 నుంచి మార్చి 7 వరకు సర్వే చేపట్టింది.  ఏపీ లో అధికార వైసీపీ మరోసారి సష్టమైన ఆధిక్యం కనబరుస్తుందని అంచనా వేసింది. మొత్తం 25 లోక్ సభ స్థానాల్లో 21-22 సీట్లను వైసీపీ గెలుచుకునే అవకాశం ఉంటుందని పేర్కొంది. తెలుగుదేశం, జనసేన కూటమికి 3-4 లోక్ సభ స్థానాలకే పరిమితం అవుతుందని జోస్యం చెప్పింది. ఇక ఓటింగ్ విషయానికొస్తే.. వైసీపీకి 49 శాతం, టీడీపీ, జనసేన కూటమికి 45 శాతం, ఇండియా కూటమికి రెండు శాతం ఉండొచ్చని తెలిపింది.

ఈ సర్వే నిజం కావాలంటే కొన్ని పరిణామాలు ఏపీలో చోటు చేసుకోవాలని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఒకటి టీడీపీ, జనసేన కలయిక వల్ల వైసీపీ ఓటు బ్యాంకు ఒక్కటై గంపగుత్తగా ఆ పార్టీకి ఓటేయ్యాలి.   రెండోది జనసేన, టీడీపీ మధ్య అనుకున్న స్థాయిలో ఓటు బదిలీ జరగకూడదు.  బీజేపీ రావడంతో కొన్ని వర్గాల ఓట్లు టీడీపీ, జనసేనకి దూరమై ఆ ఓట్లన్నీ వైసీపీకే పడాలి.

ఇప్పటికీ పట్టణాల్లో.. కొన్ని ప్రాంతాల్లో వైసీపీ పట్ల అసంతృప్తి నెలకొంది. వీరు బీజేపీ పై కోపంతో ఫ్యాను గుర్తు వైపు మళ్లితే అది టీడీపీకి కోలుకోలేని దెబ్బే అవుతుంది.  అలాగే బీజేపీ తో టీడీపీ కలవడం వల్ల ఏపీకి ఏ రకంగా సహకరించకుండా.. ఇప్పటి వరకు వైసీపీకి అనుకూలంగా ఉన్న కాషాయ పార్టీ పై టీడీపీ శ్రేణుల్లోనే కోపం ఉంది. దీంతో పాటు ముద్రగడ, హరిరామ జోగయ్య వంటి నేతల వల్ల కాపు ఓట్లు ఆశించిన మేర టీడీపీ, జనసేన కూటమికి బదిలీ కాకుండా ఉంటే వైసీపీ ఈ రేంజ్ లో ఫలితాలు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: