రియల్‌ ఎస్టేట్‌పై రేవంత్ రెడ్డి ఎఫెక్ట్‌?

Chakravarthi Kalyan
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంగా ఇప్పుడు రాజకీయాలు నడుస్తున్నాయి. అధికారం చేపట్టిన నాటి నుంచి దూకుడైన నిర్ణయాలతో ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిస్తున్నారు.  ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది. ఇప్పటికే నాలుగు గ్యారంటీలను అమలు చేసింది. ఇంత వరకు బాగానే ఉంది.

కానీ వీటి అమలుకు భారీ ఎత్తున నిధులు కావాల్సి ఉంది. తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని మాజీ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. సంపద సృష్టించలేదంటూ దుయ్యబడుతున్నారు. మరోవైపు లంకె బిందెలు ఉన్నాయని వస్తే.. మట్టికుండలు ఉన్నాయని సాక్షాత్తూ సీఎం రేవంత్ రెడ్డే వ్యాఖ్యానించారు. మరి ఆరు గ్యారంటీలకు నిధులు ఎలా సమకూరుస్తారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

రేవంత్ సీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇది ఆర్థికంగా భారీ ఎత్తున లాభాలు తెచ్చిపెట్టాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు . అది ప్రభుత్వానికా.. కాంగ్రెస్ పెద్దలకా అనేది సీఎం కే తెలియాలి అని పేర్కొంటున్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ మూడు చోట్ల మాత్రమే సొంతంగా అధికారంలో ఉంది. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎన్నికల ఫండింగ్ ఇక్కడి నుంచే పంపించాలి.  అది ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకున్నా

సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న కీలక నిర్ణయాలు ఏంటంటే.. ఫార్మాసిటీ రద్దు చేస్తున్నామని ప్రకటించారు. మొత్తం రియల్ ఎస్టేట్ ఘొల్లుమంది. దీంతో తెర వెనుక ఏవో ప్రయత్నాలు జరుగుతాయి కదా. రెండోది ఓఆర్ఆర్ ఎక్స్ టెన్షన్. దీని ద్వారా అక్కడి రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందుతుంది. మెట్రో లో మార్పులు చేర్పులు. వీటి ద్వారా  ఏదో ఒక లబ్ధి చేకూరే ఉంటుంది అనే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధికారంలో ఉండే పవర్ మ్యాజిక్ అని వివరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: