చంద్రబాబు, జగన్.. ఇద్దరిపైనా కస్సుమంటున్నారు?

Chakravarthi Kalyan
ప్రతిపక్ష నేత చంద్రబాబు, సీఎం జగన్ పై ఓ వర్గం గుర్రుగా ఉంది. అదేంటి ఇద్దరిపై ఒకే వర్గం ఎలా కోపంగా ఉంటుంది. ఉంటే చంద్రబాబు కి మద్దతుగా ఉండాలి. లేకపోతే జగన్ కు అండగా నిలవాలి. ఇది ఎలా సాధ్యం అంటే.. ప్రస్తుతం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల పేదలు 80శాతం మంది వైసీపీకి మద్దతుగా ఉన్నారు. ఏడాదికి ఒక్కో కుటుంబానికి రూ.50 చొప్పున ఐదేళ్ల నుంచి కుటుంబానికి రూ.2.5లక్షల ఆర్థిక సాయం అందించారు. అయితే ఖర్చులు పెరిగాయన్న కోపంతో మధ్య తరగతి వర్గం అంతా కూడా చంద్రబాబుకి అండగా నిలిచి జగన్ ను ద్వేషించడం మొదలు పెట్టారు. కానీ ఎగువ మధ్య తరగతి వర్గం మాత్రం అటు చంద్రబాబుని.. ఇటు జగన్ ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే వీరికి సంక్షేమ పథకాలు అసలు ఇష్టం ఉండదు.

ఎందుకంటే ఎగువ మధ్య తరగతి వారు పేదలకు పని కల్పిస్తూ ఉంటారు. ఈ పనికోసం పేదలు ఆశగా ఎదురు చూస్తూ వీరు చెప్పిందల్లా చేస్తూ ఉంటారు. ఇచ్చింది తీసుకొని వెళ్తుంటారు. కానీ జగన్ వచ్చిన తర్వాత నేరుగా ఆర్థిక సాయం అందిస్తుండటంతో పాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుండటంతో వీరంతా పని చేసేందుకు డిమాండ్ చేస్తున్నారు.

గతంలో ఇచ్చింది తీసుకునే పేదలు ఇప్పుడు డిమాండ్ చేసే స్థాయికి వెళ్లారు.  దీంతో పేదలపై వీరికి పెత్తనం పోయింది. ఇది ఎగుమ మధ్య తరగతి వారికి రుచించడం లేదు. ఒకవేళ జగన్ బదులు చంద్రబాబు పదవిలోకి వస్తే ఇంతకు మించి సంక్షేమాన్ని అందిస్తానని అంటున్నారు. గతంలో శ్రీలంక, వెనుజులా అవుతుందని ప్రభుత్వ పథకాలను విమర్శించిన.. ఆయన ఇప్పుడు తాము వచ్చి సింగపూర్ చేస్తానని అంటున్నారు. దీంతో ఈ ఇద్దరిపై ఈ వర్గం వారు గుర్రుగా ఉన్నారు. దీనికి ఏ పరిష్కారం లేదేమో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: