ఏపీలో వారిదే ప్రభంజనం.. కొత్త సర్వే ఫలితాలు?

Chakravarthi Kalyan
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో జాతీయ స్ధాయిలో సైతం అందరి దృష్టి ఏపీపై పడింది. అటు జాతీయ మీడియా సంస్థలతో పాటు ఏజెన్సీలు వరుస పెట్టి సర్వేలు చేస్తున్నాయి. ప్రతి రోజు సర్వే ఫలితాలు ఇవి అంటూ వెల్లడిస్తున్నాయి. దీంతో ఏపీలో సర్వేలు సర్వ సాధారణం అయిపోయాయి. ఇటువంటి తరుణంలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్ తాను చేపట్టిన ఆసక్తికర సర్వే ఫలితాలను వెల్లడించారు.

ఏపీలో అధికారంలోకి వచ్చేది ఆ పార్టీయేనని తేల్చి చెప్పారు. గత ఎన్నికల్లో పృథ్వీ రాజ్ వైసీపీ తరఫున ప్రచారం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సేవలను గుర్తించిన జగన్ కీలక పదవి అప్పగించారు. టీటీడీ భక్తి ఛానల్ ఛైర్మన్ గా నియమించారు.

ఆయనపై ఆరోపణలు రావడంతో పదవి నుంచి తప్పించారు. అప్పటి నుంచి వైసీపీకి దూరం అయిన ఆయన టీడీపీ, జనసేన కు అనుకూలంగా ప్రకటనలు చేస్తూ వచ్చారు. కాగా ఇటీవల జనసేనలో చేరారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన కు మద్దతుగా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ పార్టీ కార్యక్రమాలకు హాజరు అవుతున్నారు. ఈ తరుణంలో శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు తాను చేపట్టిన సర్వే ఫలితాలను వెల్లడించారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి అద్భుత విజయం సాధిస్తుందని పృథ్వీ రాజ్ తేల్చి చెప్పారు. కూటమికి 136 అసెంబ్లీ స్థానాలు వస్తాయని ప్రకటించారు. వైసీసీ 39 సీట్లకే పరిమితం అవుతుందని జోస్యం చెప్పారు. పార్లమెంట్ లెక్కలను కూడా చెప్పేశారు. 25 ఎంపీ సీట్లకు టీడీపీ జనసేన కూటమి 21 స్థానాలు సాధిస్తుందని స్పష్టం చేశారు. మరోవైపు వైసీపీ నుంచి పడే తొలి వికెట్ మంత్రి రోజాయేనని చెప్పుకొచ్చారు. చూద్దాం ఇది ఎంత వరకు నిజం అవుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: