అన్ని రూల్స్ బ్రేక్‌ చేస్తున్న జగన్.. సాహసమా? మూర్ఖత్వమా?

Chakravarthi Kalyan
గతంలో ఎన్నికలు అంటే ఆరు నెలల ముందు నుంచే సభలు నిర్వహించడం, ప్రతి నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పర్యటించడం అనేది జరుగుతుండేవి. గతంలో రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, ఎన్టీఆర్ హయాంలో ఇదే విధానం కొనసాగింది. వీటిని ఎవరూ మార్చే ప్రయత్నం చేయలేదు. కానీ ఈ సంప్రదాయాలను సీఎం జగన్ మోహన్ రెడ్డి మార్చేస్తున్నారు.

గతంలో ఎప్పుడు చూసుకున్నా చంద్రబాబు ఎన్నికల సమయంలోనే ప్రజల వద్దకు వచ్చేవారు. సభలు, సమావేశాలు నిర్వహించి వారిని ఉత్సాహ పరిచేవారు. నాయకుల్ని సంసిద్ధం చేసేవారు. ఇప్పుడు కూడా రా కదిలి రా సభలు కూడా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నిర్వహిస్తున్నారు. మరోవైపు లోకేశ్ కూడా పాదయాత్ర పేరుతో సభలు నిర్వహిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ విధానాన్ని జగన్ పూర్తిగా మార్చేశారు.

ఇంతకీ జగన్  ఏం చేస్తున్నారు అంటే రెండేసి, మూడేసీ లక్షల మంది ప్రజలతో సభలు నిర్వహిస్తున్నారు. అయిదు లక్షల మంది అని బహిరంగ ప్రకటనలు చేసినా వాస్తవానికి రెండు లక్షల మందికి తగ్గకుండా జన సమీకరణ చేస్తుంటారు. ప్రతి సచివాలయ పరిధి నుంచి కనీసం ఏడుగురికి తగ్గకుండా జనాలను పోగేస్తున్నారు. బస్సులు ఏర్పాటు చేయడం, తీసుకెళ్లడం, తీసుకురావడం లాంటి వి చేస్తూ జనాలను మెబులైజ్ చేస్తున్నారు.

ఇలా ప్రతి ఊరిలో జన సమీకరణ కంటే కూడా భారీ సభల ద్వారా జనం మొత్తాన్ని ఓ దగ్గర  చూపించి .. మా సభలకు జనం ఏ విధంగా వస్తున్నారో చూడండి అంటూ ప్రతి పక్షాలకు సవాల్ విసురుతున్నారు. ఇదే సమయంలో ఎల్లో మీడియాకు కూడా ఎందుకంటే వాళ్లు కూడా జనం రాలేదని.. కుర్చీలు ఖాళీగా ఉన్నాయని సభ వెనుక నుంచి ఫొటోలు తీసి ప్రచారం చేస్తారు కాబట్టి… బహిరంగ సభ అయితే పెద్ద సంఖ్యలో   జనం విజువల్స్ చూసిన తర్వాత మీడియా పనిగట్టుకొని సభ ఫెయిల్ అయిందని రాసినా ఎవరూ నమ్మరు. కాబట్టే జగన్ ఈ తరహా సంప్రదాయానికి తెరతీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: