వైఎస్‌ షర్మిల ప్రాణాలకు ముప్పు ఉందా?

Chakravarthi Kalyan
ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి వైఎస్ షర్మిళ ఏపీలో అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ప్రత్యేక హోదా పేరు చెప్పి కేంద్రంలోని బీజేపీని రాష్ట్రంలోని వైసీపీని తీవ్ర స్థాయిలో దుయ్యపడుతున్నారు. ఈ నేపథ్యంలో రివర్స్ లో షర్మిళపై ఫైరవుతున్న వైసీపీ నేతలు ఆమె చంద్రబాబు వదిలిన బాణంగా వర్ణిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు ప్రాణ హానీ ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ సీనియర్ నాయకులు అయ్యన్నపాత్రుడు.

అవును చర్చ జరుగుతున్న అంశాన్ని మాట్లాడుతారో లేక.. చర్చ జరగాలని స్పందిస్తారో తెలియదు కానీ… తాజాగా మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు వైఎస్ షర్మిళకు ప్రాణ హానీ ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా బాబాయిని చంపిన వారికి  చెల్లిని చంపడం ఓ లెక్క కాదంటూ మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఆమెను రక్షించుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో జగన్ కు తల్లి, చెల్లీ, బాబాయ్ అనే తేడా లేదు. షర్మిళను అంతమొందిచ్చినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. అందువల్ల ఆమెకు భద్రత పెంచాలి.  రాజశేఖర్ రెడ్డి ఆస్తిలో షర్మిళకు వాటా రాశారు. అది జగన్ ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇక్కడ విచిత్ర పరిస్థితి ఏంటంటే టీడీపీ నాయకులు ఇతర పార్టీ నాయకులపై సానుభూతి వ్యక్తం చేయడం.

గతంలో బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కి వైసీపీ నాయకులు కౌంటర్ ఇస్తుంటే ఆమెకు మద్దతుగా వర్ల రామయ్య, ఇతర సీనియర్ నాయకులు మాట్లాడారు. దీంతో పురంధేశ్వరి టీడీపీ కోసమే పనిచేస్తున్నారని ఇదిగో సాక్ష్యం అంటూ వైసీపీ నాయకులు చెప్పే ప్రయత్నం చేశారు.  ఇప్పుడు కూడా షర్మిళ ను వైసీసీ నాయకులు చంద్రబాబు వదిలిన బాణంగా అభివర్ణిస్తున్న క్రమంలో ఆమెకు రక్షణ కల్పించాలని అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేయడం సంచలనంగా మారింది.  ఒకవేళ ప్రాణ హానీ ఉంటే షర్మిళ పోలీసులకు ఫిర్యాదు చేయాలి.  కానీ  అయ్యన్నపాత్రుడు కోరడం వెనుకు రెండు పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: