బీజేపీతో టీడీపీ పొత్తులో కీలక మలుపు?

Chakravarthi Kalyan
ఏపీ రాజకీయాల్లో రోజుకో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. ప్రతి రోజూ క్లైమాక్స్ లా ఉంటుంది. పార్టీలు చేస్తున్న వ్యూహాలు.. వేస్తున్న అడుగులు.. తీసుకుంటున్న నిర్ణయాలు వెల్లడిస్తున్న ఆశయాలు.. వెరసి ఏపీలో రసవత్తర రాజకీయం తెరపైకి వస్తూ ఉంది. ఈ క్రమంలో ఏపీలో బీజేపీ సరికొత్త రాజకీయ అంశానికి తెరతీసిందని తెలుస్తుంది.

తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు ఉంది. అలాగే జనసేన, బీజేపీ మధ్య కూడా పొత్తు ఉంది. కానీ ఈ మూడు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకోలేదు. అది తేల్చడానికే పవన్ కల్యాణ్ తాజాగా దిల్లీ పర్యటన చేపట్టారు. అయితే ఇప్పటి వరకు పొత్తుల వ్యవహారం కానీ.. పోటీ చేసే స్థానాలపై కానీ పార్టీలో చర్చ జరగలేదు. ఈ విషయం పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి శివప్రకాశ్ జీ వెల్లడించారు. అయితే ఎవరైనా సరే చంద్రబాబు పల్లకీ మోయాలి తప్ప చంద్రబాబు ఎవర్నీ రాజకీయంగా ఎదగనివ్వరు.

తాజాగా బీజేపీలో వినిపిస్తున్న మాట ఏంటంటే టీడీపీ పొత్తు పెట్టుకున్న తర్వాత ఎప్పుడూ ద్రోహమే చేసింది. మరోపక్క కమ్యూనిస్టులను, బీజేపీని, కాంగ్రెస్ ను రాజకీయంగా ఎదగనీయట్లేదు కాబట్టి సంపూర్ణమైన పొత్తు ఉండాల్సిందే అని బీజేపీ పట్టుబడుతున్నట్లు సమాచారం. అది ఎలా అంటే బీజేపీ, జనసేన కూటమికి 50శాతం సీట్లు ఇవ్వాలనేది ఆ పార్టీ పెద్దల ప్రతిపాదన.

ఇప్పటికే పవన్ కల్యాణ్ మూడో వంతు సీట్లు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో తాజా కాషాయ పెద్దలు పెట్టిన ప్రతిపాదన టీడీపీకి తలనొప్పి కలిగించే అంశమే. ఇలా అయితే కనీసం 70 సీట్ల వరకు ఇస్తారనేది కమల దళ నేతల వ్యూహం. దీనికి సరే  అంటేనే పొత్తుల గురించి మాట్లాడదాం.. సీట్లపై చర్చిద్దాం అని బీజేపీ చెబుతున్నట్లు తెలిసింది. అయితే ఈ ప్రతిపాదనకు చంద్రబాబు సిద్ధంగా లేరు. 50శాతం సీట్లు కానీ.. కనీసం 60 సీట్లు ఇచ్చినా టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు వస్తాయి. చూద్దాం ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: