ధారావి తలరాత అదానీ మారుస్తారా?

Chakravarthi Kalyan
మహేశ్ బాబు బిజినేస్ మ్యాన్ చూసిన ప్రతి ఒక్కరికి ధారావి గురించి తెలిసే ఉంటుంది.  దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోని ధారవి ఆసియాలోనే అతిపెద్ద మురికి వాడ. దీని పరిమాణం న్యూయార్క్ సెంట్రల్ పార్క్ లా ఉంటుంది. కానీ ఈ చిన్న ప్రదేశంలో లక్షలాది మంది ప్రజలు నివసిస్తున్నారు. ఈ చిన్న ప్రాంతంలో వేలిచి ఇళ్లు నిర్మించారు. ధారావి మురికివాడ పేద ప్రజల కాలనీ. అక్కడ నివసిస్తున్న వేలాది మంది ప్రజలకు స్వచ్ఛమైన నీరు, శుభ్రమైన మరుగుదొడ్లు అందుబాటులో లేవు.

అయితే కొంతకాలంగా ప్రముఖ మురికి వాడ అయిన ధారావి రీడెవలప్ మెంట్ ప్రాజెక్టు గురించి చాలా కాలంగా చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఈ మురికి వాడలో నివసించే వారికి ఓ శుభవార్త అని చెప్పవచ్చు. 640 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ధారావి మురికి వాడ పునరాభివృద్ధి ప్రాజెక్టును మహారాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అదానీ గ్రూపు దక్కించుకుంది.

గౌతమ్ అదానీ ద్వారా నియమించిన ఓ కంపెనీ రీ డెవలప్ మెంట్ లో భాగంగా ఫిబ్రవరి నుంచి ముంబయిలోని ధారవి స్లమ్ లోని 10 లక్షల మంది నివాసితుల డేటా సేకరించడం ప్రారంభిస్తుంది. పునరాభివృద్ధి చేసిన ప్రాంతంలో ఉచిత గృహాలను పొందేందుకు ధారావి నివాసితుల అర్హతను ఈ నిర్ణయించడంలో ఈ సర్వే కీలకం.

అయితే అర్హులందరికీ 350 చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త ప్లాట్లను అందజేస్తామని అదానీ గ్రూపు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మురికివాడల పునరాభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా అందించే దాని కంటే ప్లాట్ పరిణామం 17శాతం ఎక్కువ అని పేర్కొంది.  పునరాభివృద్ధి చేసిన ప్రాంతంలో కమ్యూనిటీ హాళ్లు, వినోద ప్రదేశాలు, పబ్లిక్ గార్డెన్ లు, డిస్పెన్సరీలు , పిల్లల కోసం డేకేర్ సెంటర్లు ఉండనున్నాయి. అయితే దీనిపై కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీని ద్వారా పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది అని ఆరోపిస్తున్నాయి. ఏది నిజమో.. ఏది  అబద్ధమో రాబోయే రోజుల్లో తేలనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: