వైఎస్‌ఆర్‌ కుటుంబంలో చిచ్చు పెట్టిందెవరు?

Chakravarthi Kalyan
వైఎస్ షర్మిళ డోసు పెంచారు. పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరంచిన అనంతరం ఆమె వైసీపీని టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. రోజురోజుకు విమర్శల్లో పదును పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు ఏకంగా సోదరుడు సీఎం జగన్ ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోని విమర్శలు చేస్తున్నారు. తన కుటుంబంలో చీలికకు కాంగ్రెస్ పార్టీయే కారణమని జగన్ ఆరోపించిన సంగతి తెలిసిందే.

ఇటీవల ఈ అంశంపై షర్మిళ స్పందించారు. వైఎస్ కుటుంబంలో చీలికకు ముమ్మాటికీ జగనే కారణమని ఆరోపణలు చేశారు. వసుధైక కుటుంబంలో చేజేతులా చీలిక తీసుకువచ్చింది జగనేనని ఆక్షేపించారు. ప్రస్తుతం జిల్లాల పర్యటనలో ఉన్న ఆమె రోజుకో తరహా విమర్శలు చేయడం గమనార్హం. జగన్ తో పాటు వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను ఆమె తిప్పికొడుతున్నారు. దంతో ఇవి రాజకీయంగా సంచలనంగా మారుతున్నాయి.  పార్టీ కోసం సుదీర్ఘంగా 3200 కి.మీ. పాదయాత్ర చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేస్తున్నారు. ఇంటిని, పిల్లలని పక్కన పెట్టి ఎండనక, వాననక పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టి సీఎం జగన్ ను సీఎం చేస్తే తనను ప్రస్తుతం పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే ఇక్కడ ఓ కీలక అంశాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. సాధారణంగా కుటుంబం అంటే భార్య, భర్త, వారి పిల్లలు, అత్తమామలు. ఇప్పుడు వైఎస్ కుటుంబంలో జగన్ చీలిక తెచ్చారని షర్మిళ ఆరోపిస్తున్నారు. దీనికి వైఎస్ విజయమ్యే సాక్ష్యం అని చెబుతున్నారు.
అంటే జగన్ షర్మిళ కుటుంబాన్ని చీల్చారా.. లేక వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని చీల్చారా అనేది స్పష్టత ఇవ్వడం లేదు. వైఎస్ కుటుంబంలో జగన్, భారతి, విజయమ్మ బాగానే ఉన్నారు. అలాగే షర్మిళ కుటుంబంలో అనీల్, షర్మిళ వారి అత్తమామలు అంతా కలిసే ఉన్నారు. వీరి ఇద్దరి కుటుంబాల్లో చీలికలేమీ లేవు.  అంటే ఆస్తి విషయాల్లో అన్నా చెల్లెలికి ఏమైనా తేడాలు వచ్చాయా.. అనేది భవిష్యత్తులో తేలనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ysr

సంబంధిత వార్తలు: