వైసీపీ కాదు.. టీడీపీ కాదు.. జనసేనే గెలిచింది?

Chakravarthi Kalyan
జనసేన పైన జనాలకు నెమ్మదిగా ఒక విశ్వాసం ఏర్పడుతుంది అని తెలుస్తుంది. ఒక కొత్త రాజకీయాన్ని ప్రజలకు పరిచయం చేయాలనుకుంటున్న జనసేనకు దానికి తగ్గ పరిస్థితులు కొంత వరకు కనిపిస్తున్నాయి. సర్పంచ్ ఎలక్షన్స్ ఫలితాలు జనసేనకు కొంతవరకు  సంతోషాన్ని కలిగిస్తున్నాయి. గతంలో గోదావరి  జిల్లాల్లో తెలుగుదేశం పార్టీతో పాటుగా కలిసి పోటీ  చేసింది జన సేన. అప్పుడు తెలుగుదేశం పార్టీతో కలిసి గోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో కొన్ని స్థానాలు గెలుచుకున్నారు.

కానీ ఈసారి మాత్రం జనసేన ఒంటరిగా పోటీ చేసి, కొంత వరకు ఫలితాన్ని అందుకుంది అని తెలుస్తుంది. జన సేన ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో ఒక స్థానాన్ని గెలుచుకుందని అంటున్నారు. అలాగే  కొన్ని గ్రామాల్లో  వార్డు మెంబర్ల స్థానాలు కూడా గెలుచుకుంది జన సేన‌. అనపర్తి నియోజకవర్గం కాండ్రేగుల గ్రామం మూడో వార్డులో జరిగిన ఉప ఎన్నికల్లో 135 ఓట్లతో జనసేన విజయం సాధించింది. మాచవరం 13వ వార్డు ఉప ఎన్నికల్లో జనసేన అభ్యర్థి మట్టవరం  వెంకటేశ్వరరావు 35 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

జనసేనకు సంబంధించిన అమ్మిశెట్టి శ్రీరామ మూర్తి చుండూరు మండలం మున్నంగి వారి పాలెం  సర్పంచ్ అభ్యర్థిగా విజయం సాధించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం లో రెండు చోట్ల నోటిఫికేషన్లు వెలువడితే రెండు చోట్లా జనసేన పార్టీనే గెలిచిందని అంటున్నారు. రావులపాలెం లోని ర్యాలీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై జనసేన తూటారపు  సుబ్రమణ్యం విజయం సాధించారని అంటున్నారు.

అయితే అక్కడ వాళ్ళు ర్యాలీలో మొదలుపెట్టిన జన సేన విజయం 2024లో కొత్తపేటలో మీపై గెలిచే వరకు సాగుతుందని స్టేట్మెంట్ కూడా ఇచ్చుకుంటూ వచ్చారు వైఎస్ఆర్సిపి కి. ర్యాలీ గ్రామం ఒకటవ వార్డు ఉప ఎన్నికల్లో ఈ రకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పై 125 ఓట్లతో  తూటారపు సుబ్రహ్మణ్యం గెలిచారని తెలుస్తుంది. అయితే ఈ సమాచారం అంతా ఫేస్బుక్ గ్రూప్ లోని ఒక పోస్ట్ ద్వారా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: