యుద్ధం మొదలుపెట్టిన పాకిస్తాన్‌?

Chakravarthi Kalyan
ఎప్పుడూ భారత్ పై విద్వేషాన్ని చిమ్ముతూ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండే పాకిస్తాన్ ఇప్పుడు భారత్ పై కాకుండా ఆఫ్గనిస్తాన్ పై యుద్ధం ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన టిటిపి తెహ్రీన్ కి తాలిబన్ ఈ పాకిస్తాన్, తెహ్రీన్ కి తాలిబన్ జిహాదీ పాకిస్తాన్ ఈ రెండు గ్రూపులు తాజాగా పాకిస్తాన్ పై దాడి చేశాయని తెలుస్తుంది. పాకిస్తాన్ లోని కైబర్ ఫక్తునియా, బెలూచిస్తాన్, గిల్గిత్ బల్టిస్తాన్ ప్రాంతాలలో ఉన్న  సైన్యంపై దాడి చేసి అనేక మంది సైనికుల ప్రాణాలు తీసేసారు వాళ్ళు.


అయితే ఈ రెండు గ్రూపులు పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకులు, ఇమ్రాన్ ఖాన్ కి సపోర్టర్స్. ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబన్స్ కూడా ఈ గ్రూపులకు సపోర్ట్ అని తెలుస్తుంది. ఈ దాడి గిరిజన ప్రాంతాలైన కైబర్ ఫక్తునియా, బెలూచిస్తాన్, గిల్గిత్ బల్టిస్తాన్  గురించి జరిగింది అని అంటున్నారు. పాకిస్తాన్ కి,ఆఫ్ఘనిస్తాన్ కి మధ్య ఉన్న మెక్ మోహన్ రేఖను అంగీకరించని ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దుని మార్చాలనుకుంటుంది. అది తన పని అని తెలియనివ్వకుండా ఈ టీటీపీ, టిటిజేపీ లతో చేయిస్తుంది.


ఇప్పటివరకు మాటల తోనూ, రాజకీయాల తోనూ ప్రయత్నాలు చేసిన పాకిస్తాన్ ఇప్పుడు ఆఫ్గనిస్తాన్ పై ప్రత్యక్ష దాడికి దిగింది. ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్ సరిహద్దుల్లో చేరింది పాకిస్తాన్. అక్కడ పాకిస్తాన్ కి వ్యతిరేకంగా తాలిబన్స్ శిబిరాలు సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ శిబిరాల గురించి తనకేమీ సంబంధం లేదంటుంది ఆఫ్ఘనిస్తాన్.


టిటిపి ద్వారా జరిగిన ఉగ్రవాద దాడులపై ఇస్లామాబాద్ ఆర్మీ చీఫ్ జనరల్ అజిమ్ మునీద్ కాబూల్‌ కు హెచ్చరికలు జారీచేశారు. దాంతో పాకిస్తాన్ దళాలు సోమ, మంగళవారాల్లో ఆఫ్ఘనిస్తాన్‌ యొక్క  ఫక్తునియా ప్రావిన్స్‌ పై బాంబుల వర్షం కురిపించాయి. అధికార ప్రకటనలు ఏమి చేయకుండానే టీటీజీపి ఏర్పాటు చేసిన శిబిరాలపై పాకిస్తాన్ దాడి చేస్తుంటే, మరో పక్కన పాకిస్తాన్ పై ఆఫ్గానిస్థాన్ సైన్యం దాడులకు పాల్పడుతూ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: