మోడీ, పవన్, బాబు.. ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ?
2019 ఎన్నికల కంటే ముందు చంద్రబాబు నాయుడు బీజేపీని తిట్టారు. బీజేపీ చేయడం వల్లే ఆంధ్రప్రదేశ్ నష్టపోతుందని తెగ ప్రచారం చేశారు. ఇలాంటి సందర్భంలో బీజేపీకి ఆంధ్రలో నష్టం చేశారు. ప్రభుత్వంతో ఉన్న అయిదుగురు ఎమ్మెల్యేలను ఇబ్బందులను గురి చేశారు. కేంద్రంతో తెగ దెంపులు చేసుకున్నారు. అయితే అనంతరం జరిగిన ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగా.. టీడీపీ మాత్రం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఘోర ఓటమి చవిచూసింది.
అయితే ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ నాయకులకు మాత్రం పవన్ తో కలిసి పని చేయాలని ఉన్నట్లు తెలుస్తోంది. కానీ కేంద్రంలోని బీజేపీ అగ్రనేతలకు మాత్రం టీడీపీతో కలవాలని లేదు. అయినా పవన్ బీజేపీతో టీడీపీని కలపాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారని సీఎం జగన్ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, మిగతా బీజేపీ నాయకులు సైతం పవన్, టీడీపీ, బీజేపీ కలవాలని కోరుకుంటున్నారని సీఎం జగన్ విమర్శలు చేస్తున్నారు.
కానీ బీజేపీ అధిష్టానం మాత్రం చంద్రబాబు చేసిన మోసానికి అస్సలు ఇష్టపడటం లేదని చెబుతున్నారు. బీజేపీ, టీడీపీ కలవాలని పవన్ శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. తన పార్టీలో ఉన్న వారికి 175 స్థానాల్లో పోటీ చేయించే సత్తా లేకున్నా.. టీడీపీ పార్టీతో కలవాలని కోరుకోవడం ఆ పార్టీకి వత్తాసు పలకడం, చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టు చదవడం లాంటివి చేయడం అనేది ..పవన్ కే సాధ్యమని ఎద్దేవా చేస్తున్నారు.