రష్యా హ్యాపీ: చీలిపోతున్న నాటో దేశాలు?

Chakravarthi Kalyan
నాటో లో ప్రస్తుతం స్వీడన్ చేరికతో 32 దేశాలు సభ్యత్వం పొందాయి. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024 లో జరగనున్నాయి. దీని కోసమే ఉక్రెయిన్ కు ఎక్కువగా ఆయుధాలు ఇవ్వలేకపోతున్నట్లు సమాచారం. అయితే అమెరికా నాటో దేశాల నుంచి మాత్రం క్లస్టర్ బాంబులను ఇప్పించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తోంది.


క్లస్టర్ బాంబ్ అంటే ఒక బాంబు వేస్తే అది 100 బాంబులతో సమానం. ఇందులో పేలని బాంబులు ఎక్కడ పడినా కొన్ని రోజుల తర్వాత పేలిపోయే అవకాశం ఉంది. నాటోలో తన ఆధిపత్యం ఉంటుందని వీటిని ఇప్పించేలా నాటో దేశాలను ఒప్పించాలని అమెరికా బైడెన్ ప్రయత్నాలు చేశారు. అయితే ఫ్రాన్స్ దీన్ని అంగీకరించ లేదు.  ఫ్రాన్స్, హంగేరీ, స్పెయిన్ లాంటి దేశాలు వద్దని చెప్పాయి. నాటోలో కొన్ని దేశాలు క్లస్టర్ బాంబులు ఇవ్వాలని చెప్పడం, కొన్ని దేశాలు వద్దని చెప్పడంతో నాటో దేశాల లక్ష్యం దెబ్బతింటోంది. అది రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా కావడంతో అమెరికాకు ఈ విషయం మింగుడు పడటం లేదు.


స్వీడన్ దేశాన్ని నాటో లో చేర్చుకోవడం ఒక్క అంశమే నాటో దేశాల సమావేశంలో సక్సెస్ అయిన అంశం. ఉక్రెయిన్ ను నాటో లో చేర్చుకునేందుకు కొన్ని దేశాలు ఒప్పుకోలేదు. అదే సమయంలో క్లస్టర్ బాంబులు కూడా ఇచ్చేందుకు ససేమిరా అన్నాయి. దీంతో అమెరికా నాటో తో సంబంధం లేకుండా ఏ దేశానికి ఆ దేశం విడిగా ఉక్రెయిన్ కు సాయం చేయాలని సూచిస్తోంది.


మీ దేశ అధికారాలు, సార్వభౌమాధికారం ఉపయోగించుకుని స్వయంగా సాయం చేయొచ్చని అమెరికా చెప్పింది. అయితే సింగిల్ గా వెళ్లి ఉక్రెయిన్ కు సాయం చేస్తే రష్యా ఆ దేశంపై దాడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి రష్యాతో యుద్ధం చేయాలని ఏ దేశం కోరుకోదు. కలిసి సాయం చేయలేనపుడు ఒంటరిగా ఎలా సాయం చేస్తారని అమెరికా ఆశిస్తుందో తెలియడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: