చంద్రబాబుకు ఆ ఇంటిపై అంత మక్కువ ఎందుకో?

Chakravarthi Kalyan
చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఉండవలసిన వ్యక్తులు ముఖ్యంగా రాజకీయ ప్రముఖులు చట్ట విరుద్ధంగా ఉండటమే ఇప్పుడు చర్చకు దారి తీస్తుంది. మరి చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తున్న ఆ వ్యక్తి ఎవరంటే చంద్ర బాబు నాయుడు అని అంటున్నారు. మరి ఏ విషయంలో ఆయన చట్ట విరుద్ధంగా ఉన్నారు అంటే లింగమనేని గెస్ట్ హౌస్ కి సంబంధించిన విషయంలో అని తెలుస్తుంది.

చంద్రబాబు నాయుడు ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ వరద నీటికి అడ్డుకట్ట కట్టి మరీ కట్టారని తెలుస్తుంది. అలాంటి ప్రదేశంలో నివాసం ఉండటం  చట్ట విరుద్దమని గతంలో చెప్పిన చంద్ర బాబు నాయుడు తానే స్వయంగా అక్కడ ఉండడం విచిత్రం. అన్నీ తెలిసి కూడా చంద్రబాబు నాయుడు అక్కడే నివాసం ఉండడానికి కారణం ఏమిటి అని కొంతమంది అడుగుతున్నారు. ఆయన దగ్గర వేరే ఇంటిని కట్టుకొని ఉండేంత సంపద లేదా? ఆయనకి ఆస్తులు, అంతస్తులు ఏమైనా తక్కువ ఉన్నాయా అని కూడా వాళ్ళు అడుగుతున్నారని తెలుస్తుంది.

లేదంటే కనీసం వేరే చోట ఇల్లు అద్దెకు తీసుకుని అయినా ఉండగలరు కదా. మరి కావాలని ఈ గెస్ట్ హౌస్ లోనే ఉండటానికి గల కారణం ఏమిటి అనేది వాళ్ళకి అర్థం అవడం లేదు ఇప్పుడు. గతంలో ఈ గెస్ట్ హౌస్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందినది అని చంద్రబాబు నాయుడు మాత్రమే కాకుండా లింగమనేని కూడా చెప్పారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చూస్తే ఆ గెస్ట్ హౌస్ లో చంద్రబాబు నాయుడు అద్దెకు ఉంటున్నారని చెప్పారు.

ఇంకో విషయం ఏమిటంటే అసలు చంద్రబాబు నాయుడు ఆ గెస్ట్ హౌస్ కి ఏ అద్దె కట్టడం లేదట. మరి అద్దె కట్టకుండా తాను అద్దె ఇంట్లో ఉంటున్నాని ఎలా చెప్తున్నారు ఆయన అని అడుగుతున్నారు. అయితే ఏసీబీ కోర్టులో లింగమనేని గెస్ట్ హౌస్ అటాచ్మెంట్ అనేసరికి తెలుగుదేశం పార్టీ వాళ్లు ఎందుకు రచ్చ చేస్తున్నారు అని కొంతమంది అడుగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: