దేశద్రోహులు: మోడీ వచ్చాక సీన్‌ రివర్స్?

Chakravarthi Kalyan
దేశ నిఘా విభాగపు నిఘా అధికారులు ఒక పక్కన దేశం కోసం పోరాడుతూ ఉంటారు‌. అయితే వీళ్ళు దేశ సైనికుల్లా తమ ఐడెంటిటీని చూపించుకోలేరు‌. కానీ వాళ్లు కూడా దేశ భక్తులే. దేశద్రోహులను తుద ముట్టించడానికి సొంత దేశంలోనూ ఇంకా పొరుగు దేశాలలో కూడా నిఘా పెట్టి మరి వాళ్ళని తుద ముట్టిస్తుంటారు. ఒకసారి వాళ్ళకి  దురదృష్టవశాత్తూ దొరికిపోతే వాళ్ల చేతుల్లోనే హతమయిపోతుంటారు.

చివరికి తాము ఏమైపోయామో కూడా కుటుంబ సభ్యులకి కూడా తెలియనంత విధంగా చనిపోతూ ఉంటారు. అదృశ్యం అయిపోతూ ఉంటారు. అయితే గతంలో మన నిఘా అధికారులు ఎక్కువగా దేశద్రోహుల చేతిలో చనిపోతూ ఉండేవారు. అయితే మోడీ వచ్చిన తర్వాత సీను దీనికి రివర్స్ అయింది. ఇప్పుడు దేశద్రోహులే ఒకరి తర్వాత ఒకరు అనుమానాస్పదంగా చనిపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

వాజ్‌పేయి ప్రభుత్వాని కంటే ముందు ఈ కౌంటర్ సిస్టం అనేది లేదు అని తెలుస్తుంది. జహీర్ మిస్త్రి అనే వ్యక్తి 1999 లో ఐసి 814 అనే విమానాన్ని హైజాక్ చేసాడు. అయితే ఆ వ్యక్తి 2001 లో కరాచీలో అనుమానాస్పద వ్యక్తుల చేతులు కాల్చివేయబడ్డాడు. రిప్ దుమన్సింగ్ మాలిక్ 1985లో ఎయిర్ ఇండియా విమానం పై బాంబు దాడి చేసినటువంటి వ్యక్తి 14 జులై 2020 న సర్రేలో కాల్చి చంప బడ్డాడు.

అలాగే హర్విందర్ సింగ్ సందు అలియాస్ రిందా 2021 లో పంజాబ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ పై ఆర్పిజి దాడి చేసిన వ్యక్తి పాక్ లోని ఓ హాస్పిటల్ లో డ్రగ్ ఓవర్డోస్ అవడంతో మరణించాడు. బషీర్ అహ్మద్ పీర్ అనే హెచ్ఎం కమాండర్ 20 ఫిబ్రవరి 2023న రావాల్సిండి లో కాల్చి చంపబడ్డాడు. సయ్యద్ ఖలీద్ రజా ఆల్బదర్ కమాండర్ తన ఇంటి వద్ద కాల్చి చంపబడ్డాడు. ఇవన్నీ కూడా అజిత్ సింగ్ ధోవల్, మోడీ వచ్చాక జరుగుతున్న ఆపరేషన్స్ అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: