ముందస్తు ఆలోచనల్లో ప్రధాని నరేంద్ర మోదీ?

Chakravarthi Kalyan
ముందస్తు ఎన్నికల అంశం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. కేంద్రంలోనూ  జరుగుతున్నాయి.  ముఖ్యంగా ముందస్తు ఎన్నికల ప్రచారం వెనక పెద్ద తతంగమే ఉంది. ఒక సారి గెలిచిన పార్టీ అయిదు సంవత్సరాలు అధికారంలో ఉంటుంది. ఆ అయిదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ తమ కార్యకర్తలను కాపాడుకోవాలి. దీని కోసం ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు ముందస్తు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. నాయకులను, కార్యకర్తలను ఎప్పుడూ యాక్టివ్ మోడ్ లో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీని వల్ల కార్యకర్తలను రాజకీయ పార్టీలను కాపాడుకుంటున్నాయి.

అయితే గతంలో కార్యకర్తలు, నాయకులు పార్టీ ఆఫీసుల్లో కూర్చొని పేపర్లు చదివేవారు. ఓడిపోయిన కూడా పార్టీ ఆఫీసుకు రోజు వచ్చే వారు. ఇలా రావడం వల్ల పార్టీ ఆఫీసులో ఏదో ఒక చర్చ జరుగుతుండేది. తమ నాయకుడు అసేంబ్లీలో ఏం మాట్లాడాడు. అధికార పార్టీ నాయకులు ఏం మాట్లాడారు. ఇలా ప్రతి చర్చ పార్టీ ఆఫీసుల్లో జరిగేది. కానీ ఇప్పుడు కేవలం సమావేశం ఉన్నపుడు మాత్రమే నాయకులు, కార్యకర్తలు కలుస్తున్నారు. దీంతో ఆయా రాజకీయ పార్టీలకు కార్యకర్తలను కాపాడుకోవడం పెద్ద టాస్క్ గా మారింది.

మొన్నటి వరకు తెలంగాణలో సీఎం కేసీఆర్ ముందస్తుకు పోతారని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆంధ్రలో సీఎం జగన్ ముందస్తుకు వెళతారని ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఏదీ నిజమో ఏదీ అబద్ధమో కానీ నాయకులను కార్యకర్తలను కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నమని అందరికీ తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్రం ముందస్తు కు వెళుతుందని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రచారం చేస్తున్నారు.

వచ్చే జనవరి లోపు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు సంబంధించి అన్ని పనులు పూర్తి చేయాలని కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చినట్లు చెబుతున్నారు. అదే గనక జరిగితే మూడు నుంచి నాలుగు నెలల ముందుగానే కేంద్రంలో ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. మరి నితీశ్ కుమార్ చెప్పినా విషయం నిజమవుతుందా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: