మోదీపై అలాంటి కుట్ర జరుగుతోందా?

frame మోదీపై అలాంటి కుట్ర జరుగుతోందా?

Chakravarthi Kalyan
రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో భాగంగా లారీ ఎక్కి ప్రయాణించారు. అక్కడ లారీ డ్రైవర్లకు, ఇక్కడి డ్రైవర్లకు ఎంతో తేడా ఉందని చెబుతున్నారు. అయితే పాత రోజుల్లో ఏదైనా, సమాచారం సేకరించాలి. దాన్ని ప్రజలకు చేరవేయాలంటే  అది నిజమే కదా అని విశ్లేషణ చేసుకుని రాసేవారు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమని ఏ వార్త అయిన క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తోంది.

అయితే సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు నిజమా కాదా అనేది తెలుసుకుంటూనే నాయకుల మనోభావాలు ఎంతో ప్రజలు ఈజీ గా అర్ధం చేసుకుంటున్నారు. దేని గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు చర్చించుకుంటున్నారు. ఎందుకు వివాదం చెలరేగుతుంది. ఎవరు రాజకీయాలు చేస్తున్నారనే విషయాల్ని గమనించుకుంటున్నారు. అమెరికాలో రాహుల్ గాంధీ లారీ ఎక్కి తిరిగి మీకు ఇక్కడ ఉన్న సౌకర్యాలు ఇండియా లో లేవని చెప్పడం వెనక పెద్ద కుట్రే దాగి ఉందని తెలుస్తోంది.

అసలు సెక్యూరిటీ ఉండే రాహుల్ గాంధీ ఎలా అందులో పర్యటించారు. దాని వెనుక రాబోయే రోజుల్లో ఎన్నికల్లో లారీ డ్రైవర్ల సమ్మె చేసేలా వారిని ఉసిగొల్పేందుకు చేస్తున్న ప్రయత్నాలు అని కొంతమంది రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నారు. అదాని వ్యవహారంలో సొరేన్ సంస్ధ, హిండెన్ బర్గ్ నివేదిక చాలా నష్టాన్ని కలిగించిన విషయం తెలిసిందే. భారత ఆర్థిక మూలాలను దెబ్బకొట్టేలా చైనా, అమెరికా లోని కొన్ని సంస్థలు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. దీనికి రాహుల్ గాంధీ ఆజ్యం పోస్తున్నారని రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నారు. 2024 ఎన్నికలకు ముందు లారీల ఉద్యమం చేసేలా మోదీ చరిష్మా దెబ్బతీసేలా ప్రయత్నాలు మొదలయ్యాయి.

అంతే కాకుండా భారత్ ను దెబ్బతీసేందుకు కార్మిక సంఘాలతో సమ్మె చేయించేలా కుట్రలు జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. మరి ఈ కుట్రల్ని నరేంద్ర మోదీ బీజేపీ ఎలా ఎదుర్కొంటూ ముందుకు వెళ్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: