సర్జికల్‌ స్ట్రయిక్‌కు.. పాకిస్తాన్‌ రెడీ అవుతోందా?

Chakravarthi Kalyan
ఒక దేశాన్ని రక్షించవలసిన సైన్యానికి ఇప్పుడు రక్షణ లేకుండా పోయిందని తెలుస్తుంది. ఇది ఇప్పుడు పాకిస్తాన్ లోని తాజా పరిస్థితి. మొన్న ఇమ్రాన్ ఖాన్ ఇచ్చిన పిలుపుతో, ఇమ్రాన్ ఖాన్ మనుషులు చేసిన దాడులతో పాకిస్తాన్ సైన్యానికి పరువు పోయినట్లయింది. అసలు వాళ్ళు ధ్వంసం చేసింది సైనిక స్థావరాలను కాదు, అక్కడి సైన్యం పరువును ధ్వంసం చేశారు అన్నట్లుగా సాగింది  వాళ్ళ దాడి.

దాంతో ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం తనని తాను మళ్ళీ నిరూపించుకోవాల్సి వస్తుంది అని తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఎయిర్ బేస్ ల మీద దాడి జరిగింది, సైనిక బేస్ ల మీద దాడి జరిగింది, ఇంకా సైనిక అధికారుల మీద కూడా దాడి జరిగింది. చెప్పాలంటే పాకిస్తాన్ సైన్యం పరువు ప్రపంచం ముందు పోయినట్లయింది. తనని తాను కాపాడుకోలేకపోయిన సైన్యం ఇక దేశానికి రక్షణ ఎలా ఇస్తుంది అన్నట్లుగా ప్రపంచం ఇప్పుడు అనుకుంటుందని తెలుస్తుంది.

అసలు దీనికంతటికీ కారణం పాకిస్తాన్ లో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంబన అని తెలుస్తుంది. ఇప్పుడు పరిస్థితి సాధారణ స్థితిలోకి రావాలంటే పాకిస్తాన్ సైన్యం తనను నిరూపించుకోవాల్సి ఉంటుంది. అలాగని అది తన శక్తిని నిరూపించుకోవడం కోసం భారత్ పైకి దాడికి దిగితే దానికి చాలా తొందరగానే బుద్ధి చెప్తుంది భారత్. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇంకా పాక్ ఆక్యుపైడ్ జమ్ము కాశ్మీర్ ఈ రెండింటిని కూడా తిరిగి స్వాధీనం కూడా చేసుకునే అవకాశం ఉంటుంది భారత్.

దాంతో ఇవన్నీ ఆలోచించి పాకిస్తాన్ భారతదేశం పైకి మాత్రం దాడికి దిగదు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  తాలిబన్ల స్నేహంతో సరిహద్దుల్లో స్థావరాలు ఏర్పరచుకున్న తెహ్రీన్ కి తాలిబన్ ఈ పాకిస్తాన్ వాళ్లు పాకిస్తాన్ లో విధ్వంసం సృష్టించి ఆఫ్ఘనిస్తాన్ కి పారిపోతూ ఉంటారు. ఇప్పుడు భారత్ తరహాలో పాకిస్తాన్ సైన్యం ఇప్పుడు తెహరిన్ కి తాలిబన్ ఈ పాకిస్తాన్ తీవ్రవాదులపై సర్జికల్ చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: