వైరల్: బయట పడిన స్కూల్ హెచ్ఎం రాసలీలలు... ఏమిటయ్యా ఇది?

frame వైరల్: బయట పడిన స్కూల్ హెచ్ఎం రాసలీలలు... ఏమిటయ్యా ఇది?

praveen
సోషల్ మీడియా వచ్చిన తరువాత కొంతమంది ముసుగులు వెనకాల ఉన్న అసలు రహస్యం బయటపడుతోంది. అప్పటిదాకా వారు చాలా మంచివాళ్ళుగానే చలామణీ అవుతారు. అయితే తమ చుట్టూ ఎవరూ లేరన్న ధీమాతో కొందరు చేసే పనులు అనుకోని విధంగా ఏదో హిడెన్ కెమెరాకు చిక్కుతూ ఉంటాయి. దాంతో వారి ముసుగు తొలగి అసలు రూపం బయటపడుతూ ఉంటుంది. ఇలాంటి సంఘటనలెన్నో ఇపుడు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఒక వీడియో ఇపుడు నెట్టింగా చాలా హాట్ టాపిక్ గా మారింది. మన భారతీయ సంప్రదాయాలలో తల్లిదండ్రుల తరువాత గురువుకే అగ్రస్థానం ఇచ్చారు. అందుకే 'గురు బ్రహ్మ, గురు విష్ణు.. గురు దేవో మహేశ్వరః.. గురు సాక్షాత్ పరబ్రహ్మ' అని అంటూ ఉంటారు. కానీ నేడు దానికి అర్ధం లేకుండా పోతోంది.
అవును, కొన్ని చోట్ల గురువు స్థానంలో ఉన్నవారు వారి వృత్తిని మరచి కామపిశాచాల్లాగా మారుతున్నారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఈమధ్య కాలంలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. గదిలోకి వెళ్లిన టీచర్‌తో హెచ్ఎం చేసిన పాడుపనిని చూసి నెటిజన్లు అవ్వ అంటూ నోటిమీద చేయి వేసుకుంటున్నారు. ఈ క్రమంలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. అవును, ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకోగా స్థానిక పాఠశాల హెచ్ఎం ప్రవర్తించిన తీరు అందరికీ ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.
మహిళా టీచర్‌ను తన గదిలోకి పిలిచిన హెచ్ఎం.. ఆమె తన గదిలోకి వెళ్ళగానే ఆమెని గట్టిగా కౌగిలిలో బంధిస్తూ ఉక్కిరిబిక్కిరి చేసాడు. చదువు చెప్పే పాఠశాల అనే విషయం కూడా మర్చిపోయి ఆమెతో సరసాలు ఆడడం ఏమిటని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ దుశ్చర్య ఆమె ఇష్టప్రకారం జరిగిందా లేదంటే కావాలనే వాడు బలవంతంగా లోబరుచుకున్నాడా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే చాలా స్కూళ్లలో పెద్ద కేడర్లో ఉన్నవారు దిగువ కేడర్లో ఉన్నవారిని మభ్య పెట్టో, బెదిరించో ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కాగా వారిద్దరికీ జనాలు గడ్డి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ వీడియో చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు, నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ వీడియో వైరల్ అవడంతో జౌన్‌పూర్‌లోనే కాకుండా మొత్తం యూపీ విద్యాశాఖలో ఈ వీడియో కలకలం రేగుతోంది. దీనిపై విద్యాశాఖాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: