రెండోసారి టెన్త్ ఫెయిలైన విద్యార్థి.. చివరికి ఏం చేశాడో తెలుసా?

praveen
టెక్నాలజీ పెరిగిపోయింది. మనిషి ఆలోచన తీరు మారిపోయింది. ఈ క్రమంలోనే పరిస్థితులకు అనుగుణంగా తమ జీవన శైలిని కూడా మార్చుకోగలుగుతున్నాడు మనిషి. కానీ ఎందుకో సమస్యలు వస్తే మాత్రం మనిషి పిరికివాడిలా మారిపోతున్నాడు అన్న విషయం నేటి రోజుల్లో వెలుగులోకి వచ్చే ఘటనల ద్వారా అర్థమవుతుంది. ఒకప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా నిలబడి ఎదుర్కొన్న మనిషి.. ఇక ఇప్పుడు చిన్న సమస్యకే కుంగిపోయి అర్ధాంతరంగా జీవితాన్ని ముగించేందుకు కూడా సిద్ధమైపోతున్నారు. దీంతో ఈ మధ్యకాలంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ఎన్నో తెరమీదకి వస్తూ ఉన్నాయి.

 ఏకంగా చిన్న చిన్న కారణాలకి అక్కడితో జీవిత ముగిసిపోయింది అని భావిస్తూ బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. స్కూల్ కు వెళ్లే విద్యార్థుల దగ్గర నుంచి ఉద్యోగం వ్యాపారం చేసే పెద్దవాళ్ల వరకు కుటుంబ బాధ్యతలను మోస్తున్న వ్యక్తులు కూడా ఇలా చివరికి చిన్న చిన్న సమస్యలకే కృంగిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా పదవ తరగతి చదివిన విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. అతను పదవ తరగతి పరీక్షలు రాయగా అందులో ఫెయిలయ్యాడు  దీంతో ఇటీవల సప్లమెంటరీ కూడా రాశాడు. కాగా సప్లమెంటరీ ఫలితాలు వచ్చాయి.

 ఇక ఈ సప్లమెంటరీ ఫలితాలను చూసుకోగా మరోసారి ఫెయిలయ్యాడు. దీంతో మనస్థాపం చెంది.. బలవన్మరణానికి పాల్పడిన విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది. బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆఫీసర్ క్వార్టర్స్ లో తన నాన్నమ్మ వద్ద ఉండే 17 ఏళ్ల అఖిల్ అనే విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు  ఇటీవల పదవ తరగతి సప్లమెంటరీ పరీక్ష ఫలితాలు రాగా రెండోసారి కూడా ఫెయిల్ అయ్యాడు అఖిల్. దీంతో ఇక మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించి.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: