కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు.. కోర్టు ఏం శిక్ష వేసిందో తెలుసా?

praveen
ఇటీవల కాలంలో ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడ తగ్గు ముఖం పట్టడం లేదు అన్న విషయం తెలిసిందే. ఆడపిల్ల కాలు బయట పెడితే చాలు ఏకంగా కామంతో కళ్ళు మూసుకుపోయిన మానవ మృగాలు దారుణంగా ఆఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మొన్నటి వరకు పక్కన కుటుంబీకులు ఉంటే ఇక ఆడపిల్లలకు రక్షణ ఉండేది. కానీ ఇప్పుడు పక్కన కుటుంబ సభ్యులు ఉన్న వారిపై దాడి చేసే మరి అఘాయిత్యాలకు పాల్పడుతూ  మృగాల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కామంతో కళ్ళు మూసుకుపోయిన మనుషులు.

 దీంతో నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత ఇక ఆడపిల్లల రక్షణ రోజురోజుకు ప్రశ్నార్థకంగా మారిపోతుంది అన్న విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. అయితే ఆడపిల్లలపై వేధింపులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించేందుకు ఎన్ని కొత్త చట్టాలు తీసుకువచ్చిన పరిస్థితుల్లో మాత్రం ఎక్కడా మార్పులు రావడం లేదు.  దీంతో ఆడపిల్లలు ఇల్లు దాటి కాలు బయటపెట్టాలంటేనే భయపడి పరిస్థితి. మరికొన్ని చోట్ల ఏకంగా ప్రేమ పేరుతో చదువుకుంటున్న ఆడపిల్లలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న వారు కూడా ఎక్కువైపోతున్నారు. ఇక్కడ ఇలాంటి ఓ  దారుణ ఘటన జరగగా నిందితుడికి కోర్టు కఠిన శిక్ష విధించింది.

 బాలికపై కన్నేసిన ఒక యువకుడు ప్రేమ అంటూ వెంటపడ్డాడు. కానీ ఆ బాలిక అంగీకరించకపోవడంతో చివరికి ఆమెను కిడ్నాప్ చేసి మరీ పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన ఎక్కడో కాదు హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది. సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని  ఉండే ఎం లక్ష్మణ్ 2018 లో ప్రేమ పేరుతో బాలికను మభ్యపెట్టి కిడ్నాప్ చేసి మరి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీస్ స్టేషన్లో ఫోక్సో చట్టం కింద కేసు నమోదు అయింది. ఇక ఈ కేసుకు విచారణ జరుగుతూ రాగా.. ఇటీవలే కోర్టు తీర్పునిచ్చింది. నిందితుడికి పదేళ్ల జైలు శిక్షతోపాటు 8000 జరిమానా  కూడా విధించింది. అదే సమయంలో బాధితురాలికి రెండు లక్షల నష్టపరిహారం చెల్లించాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది కోర్టు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: