వంట త్వరగా చేయమన్న భర్త.. భార్య చేసిన పనికి అందరూ షాక్?

praveen
భార్యాభర్తల బంధం అనేది అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ గా ఉండాలి. ఒక్కసారి మూడుముళ్ల బందంతో ఒక్కటైన తర్వాత ఎన్ని కష్టసుఖాలు ఎదురైనా సరే ఒకరికి ఒకరు తోడు నీడగా ఉండాలి. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం ఇలాంటి అన్యోన్యత ఎక్కడ భార్యాభర్తల్లో కనిపించడం లేదు. ఏకంగా చిన్నచిన్న గొడవలకే అక్కడితో బంధాన్ని తెంచుకోవడానికి  సిద్ధమవుతున్నారు తప్ప.. ఏకంగా బంధాన్ని కాపాడుకోవాలి అడ్జస్ట్మెంట్ అయి బ్రతకాలి అనే ఆలోచన మాత్రం ఎవరు చేయడం లేదు.

 అదే సమయంలో చివరికి భార్య భర్తల మధ్య తలెత్తుతున్న చిన్నపాటి గొడవలు ఎన్నో ఆత్మహత్యలకు కూడా కారణం అవుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇలాంటి తరహా ఘటనలు  చూసిన తర్వాత పెళ్లి చేసుకుంటే ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందా అనే భావన యూత్ అందరిలో కూడా కలుగుతుంది  అయితే ఇటీవల దువ్వాడలోని కనితిలో కూడా ఇలాంటి విషాదకర ఘటన జరిగింది. ఈ ప్రాంతంలో నివాసముంటున్న వ్యాన్ డ్రైవర్ బియ్యపు బాలాజీ గవర కంచరపాలెం కు చెందిన జ్యోతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

 అయితే వీరికి ఏడాది పాప యక్షిత ఉంది. కాగా ఇటీవలే తన తండ్రికి క్యారేజ్ పట్టుకెల్లాలి వేగంగా వంట చేయమని బాలాజీ భార్య జ్యోతి కి చెప్పాడు  అయితే ఇంట్లో పనులన్నీ తానే చేయాలని..  కాస్త కసురుకుంది ఆమె. అంతేకాకుండా కోపంతో చేతిలో ఉన్న చంటి పాపను కింద దించేసి బెడ్ రూమ్ లోకి వెళ్లి తలుపు గడియ వేసుకుంది. అయితే ఎప్పుడూ ఇలాగే అలుగుతుంది అనుకున్నాడు బాలాజీ. కానీ ఆ తర్వాత చూస్తే ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇక ఇది గమనించిన బాలాజీ భయంతో గట్టిగా కేకలు వేశాడు. తలుపులు బద్దలు కొట్టి రక్షించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ జ్యోతి మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: