బిత్తర చూపులతో కనిపించిన యువకుడు.. అనుమానంతో ఆపి బ్యాగ్ చెక్ చేస్తే?

praveen
ఈ మధ్యకాలంలో అక్రమార్కులందరూ  నేరాలు చేయడంలో  ఎంతో క్రియేటివిటీ చూపిస్తున్నారు. డబ్బు లేదా మాదకద్రవ్యాలు లాంటివి అక్రమంగా రవాణా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు  ఏదో ఒక విధంగా పోలీస్ అధికారులు కల్లు కప్పి ఇలా అక్రమ రవాణా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ చివరికి పోలీసులకు దొరికిపోతున్నారు అన్న విషయం తెలిసిందే. ఇలాంటి తరహా ఘటనలు ఈ మధ్యకాలంలో చాలానే వెలుగులోకి వస్తున్నాయ్.

ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఎన్నికల హడావిడి నెలకొన్న నేపథ్యంలో పోలీసులు కూడా అలెర్ట్ అయ్యారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎవరు కూడా అక్రమంగా మద్యం గాని డబ్బు గాని తరలించేందుకు వీలు లేకుండా ముమ్మర తనిఖీలు చేస్తున్నారు అని చెప్పాలి  అయితే ఇలా పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీలలో ఇక ఎన్నో చోట్ల అక్రమంగా తరలిస్తున్న నగదు బయటపడటం సంచలనంగా మారిపోతోంది.

 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కటారి వారి పాలెం లో పోలీసులు ఎన్నికల తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే అక్కడ బిత్తర చూపులు చూస్తూ ఓ యువకుడు కనిపించాడు. దీంతో అతనిపై అనుమానం వచ్చిన పోలీసులు ఏకంగా అతన్ని ఆపి తనిఖీలు చేశారు. దీంతో ఈ తనిఖీల్లో బయటపడింది చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇలా బిత్తర చూపులతో కనిపిస్తున్న యువకుడు వద్ద 22.95 లక్షలు లభ్యం అయ్యాయి. ఈ డబ్బులు ఎలా వచ్చాయి అని పోలీసులు అతని ప్రశ్నించగా.. తాను ఇటీవల ఇల్లు అమ్మానని.. దానికి చెందిన నగదు తీసుకు వెళుతున్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే పోలీసులు మాత్రం ఆ డబ్బుకు సంబంధించిన ఆధారాలు కోసం ఆరాతీస్తున్నారు. ప్రస్తుతం ఆ డబ్బును సీజ్ చేశాను అని చెప్పిన పోలీస్ అధికారులు.. ఇక సరైన ఆధారాలు చూపితే డబ్బును మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాము అంటూ తెలిపారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: