రూ.150 కోసం.. అతను చేసిన పనికి అందరూ షాక్?

praveen
నేటి టెక్నాలజీ యుగంలో మనిషిలో విచక్షణ జ్ఞానం పూర్తిగా తగ్గిపోతుందా అంటే వెలుగులోకి వచ్చే ఘటనలు చూసిన తర్వాత అవును అనే సమాధానమే చెబుతున్నారు ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఒకప్పుడు ఎలాంటి సమస్య వచ్చిన ధైర్యంగా నిలబడి ఎదుర్కొన్న మనిషి.. ఇక ఇప్పుడు చిన్న సమస్యకే కృంగిపోతున్నాడు. అక్కడితో జీవితం ఆగిపోయింది అని భావిస్తూ చివరికి మనస్థాపంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఇలాంటి తరహా ఘటనలతో సభ్యసమాజం తీరు ఎటు పోతుందో కూడా అర్థం కాని పరిస్థితికి కారణం అవుతూ ఉన్నాయి అని చెప్పాలి.

 అయితే ఇటీవల కాలంలో ఎంతోమంది చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనల గురించి.. తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా 150 రూపాయల కోసం ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తన కోసమే భార్యా పిల్లలు బ్రతుకుతున్నారని.. ఒకవేళ తాను ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళు రోడ్డున పడతారు అన్న విషయాన్ని ఎక్కడ ఆలోచించలేదు. ఇలా క్షణికావేషంలో ఆత్మహత్య చేసుకున్న ఘటన చివరికి ఒక కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని షామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

 భార్య 150 రూపాయలు అడిగితే ఇవ్వలేదు అని మనస్థాపానికి గురైన భర్త చివరికి ఆత్మహత్యకు పాల్పడ్డాడు  ఒడిస్సా కు చెందిన దింటూ సాహూ అనే 24ఏళ్ల యువకుడు బీష్ణు సహస్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే బతుకుదెరువు నిమిత్తం ఒడిశా నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చి షామీర్పేట్ పరిధిలోని మజీద్పూర్ లో ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.  ఇటీవల తనకు 150 రూపాయలు ఇవ్వాలి అంటూ భార్యను అడిగాడు. కానీ ఆమె మాత్రం తన దగ్గర లేవు అంటూ చెప్పింది. దీంతో ఇదే విషయంపై భార్యతో గొడవపడ్డాడు. ఇక భార్యతో గొడవపై తీవ్ర మనస్తాపం చెందిన దుంటూ సాహూ చివరికి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: