మూడో పెళ్ళై 3 నెలలు కాలేదు.. మరో అమ్మాయి వెంట పడుతున్న షోయబ్ మాలిక్?

praveen
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్, ఇండియన్ స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా వ్యవహారం ఎంతలా సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో విమర్శలు వస్తున్న పాకిస్తాన్ ప్లేయర్ ను ప్రేమ వివాహం చేసుకుంది సానియా మీర్జా. ఇక ఆ తర్వాత ఆటకు దూరమైంది అని చెప్పాలి. అయితే గత కొంతకాలం నుంచి సానియా  భర్త షోయబ్ మాలిక్ తో విడాకులు తీసుకోబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. ఇక వీరిద్దరూ కలిసి ఫ్యామిలీ ఫంక్షన్స్ కి విడివిడిగా హాజరవుతూ ఉండడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది.

 అయితే వీరిద్దరి విడాకుల వ్యవహారం నిజమే అన్న విషయం ఆ తర్వాత బయటపడింది. ఏకంగా షోయబ్ మాలిక్ తన రెండో భార్య  సానియా మీర్జాకు విడాకులు ఇచ్చి పాక్ నటిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో సానియా మీర్జా షోయన్ విడాకుల వ్యవహారం అధికారికంగా ప్రకటించినట్లు అయింది. ఇక ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో.. ఎన్నో రోజులపాటు హాట్ టాపిక్ గా మారిపోయింది. సర్లే ఏదో జరిగింది జరిగిపోయింది కనీసం మూడో భార్యతో అయినా షోయబ్ కలిసి ఉంటాడు అని అభిమానులు అనుకున్నారు.

 కానీ ఇక ఇప్పుడు షోయబ్ మాలిక్ మరో అమ్మాయి వెంటపడుతున్నాడట. షోయబ్ మాలిక్ మూడో పెళ్లి చేసుకొని మూడు నెలలు కూడా కాకముందే.. మరో అమ్మాయి వెంట పడుతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. పాకిస్తాన్ ప్రముఖ నటి నవల్ సయ్యద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు పెళ్లి అయిన క్రికెటర్ల నుంచి మెసేజ్లు వస్తున్నాయంటూ సమాధానం చెప్పగా.. మీరు షోయబ్ మాలిక్ గురించి మాట్లాడుతున్నారా అంటూ యాంకర్ ప్రశ్నించింది. దీంతో ఆమె నవ్వుతూ సమాధానం దాటవేశారు. ఆమె చెప్పింది షోయబ్ గురించేనని.. ఇక మూడో పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే నాలుగొ భార్యను కూడా షోయబ్ వెతుక్కోవడం మొదలుపెట్టాడు అంటూ అందరూ విమర్శలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: