మనం ఇంకా ఏ కాలంలో ఉన్నాం.. 12 ఏళ్ళ బాలికకు ఎవరితో పెళ్లయిందో తెలుసా?

praveen
బాల్యవివాహాలు చేయడం చట్ట ప్రకారం నేరం  ఈ విషయం అందరికీ తెలుసు. కానీ ఎక్కడ బాల్యవివాహాలు మాత్రం ఆగడం లేదు  ఇంకా 18 ఏళ్ల వయసు కూడా నిండకముందే ఎంతో మంది తల్లిదండ్రులు ఏకంగా తమ కూతుర్లకు పెళ్లి చేయాలని అనుకుంటున్నారు. కూతుర్లను భారంగా అని భావిస్తూ.. గుండె మీద బరువు అనుకుంటున్న తల్లిదండ్రులు ఇంకా కనిపిస్తూనే ఉన్నారు  ఏకంగా బాగా చదివించి కూతురిని ప్రయోజకురాలిని చేసిన తర్వాత పెళ్లి అనే ఆలోచన చేయాల్సింది పోయి పోలీసులకు.. తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసి అభం శుభం తెలియని ఆడపిల్లను అత్తారింటికి పంపిస్తున్నారు.

 ఇలా బాల్య వివాహాలకు సంబంధించిన ఘటనలు ఎన్నో.. ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తూనే ఉన్నాయి అని చెప్పాలి. అయితే కేవలం మనదేశంలోనే కాదు ఇతర దేశాలలో కూడా ఇలాంటి దారుణమైన ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది అయితే మరింత దారుణమైన ఘటన గురుంచి.. ఈ ఘటన గురించి తెలిసిన తర్వాత మనం నాగరికత సమాజంలో ఉన్నామా లేక రాజుల కాలంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే అభం శుభం తెలియని 12 ఏళ్ల బాలికను ఏకంగా కాటికి కాళ్లు చాపిన 63 ఏళ్ల వృద్ధుడు పెళ్లి చేసుకున్నాడు.

 ఈ ఘటన పశ్చిమ ఆఫ్రికాలోని గణాలో వెలుగులోకి వచ్చింది. 12 ఏళ్ల బాలికను 63 ఏళ్ళ వృద్ధుడు వివాహం చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా పోలీసులు రంగంలోకి దిగారు. మార్చి 30వ తేదీన వీరి వివాహం జరుగగా.. ఇక అభం శుభం తెలియని బాలికను ఇలా బాల్య వివాహం చేసుకోవడం సంచలనగా మారిపోయింది అని చెప్పాలి. అయితే కన్యను పెళ్లి చేసుకోవాలనే పాత ఆచారం ప్రకారం ఈ వివాహం జరిగిందని.. ఇక ఈ వేడుకకు హాజరైన ఒక అతిధి వివరించాడు. అయితే ఆ ప్రాంతంలో ఇలాంటి వివాహాలు జరగడం కొత్తేమీ కాదని.. సర్వసాధారణం అంటూ ఆయన చెప్పిన వ్యాఖ్యలు అందరిని అవాక్కయ్యేలా చేస్తున్నాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: