అనుమానం పెనుభూతంగా మారింది.. చివరికి భర్త ఏం చేశాడంటే?

praveen
మనిషిలో మనిషి అనేవాడు కనుమరుగైపోతున్నాడా అంటే నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా అవును అనే సమాధానమే చెబుతున్నారు. ఎందుకంటే మానవత్వం అనే పదానికి కేరాఫ్ అడ్రస్ గా ఉండే మనిషి.. ఇక ఇప్పుడు మానవ మృగంగా మారిపోతున్నాడు. అయితే మనిషి ఎప్పుడూ స్వార్థపరుడే. ఇప్పుడు మనిషిలో ఉండే స్వార్థం మరింత పెరిగిపోయింది. మొన్నటి వరకు నేను నా కుటుంబం బాగుంటే సరిపోతుంది ఎవరు ఎటు పోయిన పర్వాలేదు అనుకునేవాడు మనిషి. కానీ ఇప్పుడు నేను అనే స్వార్థం పెరిగిపోయి.. రాక్షసుడిగా మారిపోతున్నాడు.

ఏకంగా సొంత వాళ్ళ ప్రాణాలు తీసేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చిన్న చిన్న కారణాలకే ఏకంగా కట్టుకున్న వారిని కడుపున పుట్టిన వారిని కూడా లెక్కచేయకుండా ప్రాణాలను గాల్లో కలిపేస్తూ ఉన్నారు ఎంతోమంది. ఇక్కడ ఇలాంటి ఓ దారుణ ఘటనే వెలుగులోకి వచ్చింది. భార్యతోపాటు అభం శుభం తెలియని పిల్లలను కూడా దారుణంగా హత్య చేశాడు తండ్రీ. ఇక మూడు రోజులపాటు వారి శవాల పక్కనే ఉన్నాడు. ఉలిక్కిపాటుకు గురి చేసే ఈ దారుణమైన ఘటన యూపీలోని లక్నోలో వెలుగులోకి వచ్చింది.

 కొన్ని రోజుల నుంచి భార్యపై అనుమానం పెంచుకున్నాడు భర్త. అనుమానం పెనుభూతంగా మారి దారుణానికి ఒడి గట్టాడు. ఏకంగా భార్య జ్యోతి మెడకు చున్ని బిగించి హత్య చేశాడు. ఆ తర్వాత ఆరేళ్ల పాయల్, మూడేళ్ల ఆనంద్ ని గొంతు నలిమి చంపేశాడు. అయితే మూడు రోజులపాటు మృతదేహాలు పక్కనే పడుకున్నాడు ఈ మానవ మృగం. అయితే రాత్రి శవాల పక్కన పడుకోవడం ఉదయం లేచి మళ్ళీ ఎప్పటిలాగానే పనికి వెళ్లడం చేశాడు. కానీ మూడు రోజుల తర్వాత దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.  పోలీసులు తాళాలు బద్దలు కొట్టి లోపల ఉన్న మృతదేహాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి నియమితుని అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: