అతనో సాఫ్ట్వేర్ ఇంజనీర్.. కానీ ఇలాంటి నీచ బుద్ధి ఏంటో?

praveen
ఇటీవల కాలంలో చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తే ఎంత బాగుంటుంది అని కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే చదువులు పూర్తయిన తర్వాత ఏదో ఒక కోర్స్ నేర్చుకొని ఇక సాఫ్ట్వేర్ కంపెనీలకు ఇంటర్వ్యూలకు వెళ్తూ జాబ్ దక్కించుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగులకు ఇచ్చే వేతనం ప్రతి సంవత్సరానికి రెట్టింపుగా పెరుగుతూ ఉంటుంది. దీంతో ఇక ఇలాంటి వేతనం కోసమే.. ఎంతో మంది సాఫ్ట్వేర్ జాబ్ చేయడానికి ఇష్టపడుతుంటారు అని చెప్పాలి.

 కానీ వచ్చిన దానితో సరిపెట్టుకోలేము అనే ఆలోచన ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ కాదు ఏకంగా అంబానీ సంపాదించినంత సంపాదించిన కూడా ఇంకా కావాలి అనే ఆశ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో ఇలా ఎంతోమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు మంచి వేతనంతో ఉద్యోగం ఉన్నా కూడా ఇక చేయకూడని పనులను చేస్తూ.. చివరికి ఇరాకాటంలో పడిపోతున్నారు. కొంతమంది ఏకంగా జైలు శిక్షలు అనుభవిస్తున్న పరిస్థితిని కొని తెచ్చుకుంటున్నారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గురించి.

 అతను ఒక మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇక మంచి జీవితం కూడా ఉంది. కానీ అతని మనసులో మాత్రం నీచ బుద్ధి మొదలైంది. చివరికి ఏకంగా అక్రమంగా గంజాయిని రవాణా చేసి అందరికీ చిన్న ప్యాకెట్లలో నింపి అమ్మడం మొదలు పెట్టాడు. చివరికి అరెస్టు అయ్యాడు. హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. కానామెట్ లో 1.8 కిలోల గంజాయిని బాలానగర్ ఎస్ఓటి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఫణి కిరణ్ వైజాగ్ నుంచి గంజాయిని కొనుగోలు చేసి చిన్న ప్యాకెట్లలో నింపి విక్రయిస్తున్నాడు. దీంతో ఇది గుర్తించిన అధికారులు అతని అరెస్టు చేశారు. అయితే గతంలో కూడా ఓసారి ఆదిభట్ల పిఎస్ పరిధిలో అతనిపై కేసు నమోదు అయినట్లు పోలీసులు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: