కోతులను తరిమెందుకు వినూత్న ప్రయోగం.. భలే వర్కౌట్ అయిందిగా?

praveen
ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా కోతులబెడద పెరిగిపోతూనే ఉంది. పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా వానర సమూహాలు ఏకంగా జనాలను ఇబ్బందులకు గురిచేస్తూనే ఉన్నాయి. కనిపించిన వస్తువులను నాశనం చేస్తూ ఇక విధ్వంసం సృష్టిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. కొన్ని కొన్ని సార్లు కోతుల సమూహాలు మనుషుల ప్రాణాలు కూడా తీస్తూ ఉండడం లాంటి ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అయితే కోతుల లను తరిమెందుకు ఎంతో మంది ఎన్నో విధాలుగా ప్రయత్నించిన.. ఏకంగా ఇలా తరిమెందుకు ప్రయత్నిస్తున్న వారిపై దాడులకు పాల్పడుతున్నాయి తప్ప కోతులు ఎక్కడ భయపడటం లేదు.

 ఇక ఇటీవల కాలంలో జనావాసాల మధ్య తిరగడానికి అలవాటు పడిపోయిన కోతుల సమూహాలు ఇక అడవుల్లోకి వెళ్లడమే మానేశాయి అని చెప్పాలి. ఏకంగా జనావాసాల నుంచి కోతుల సమూహాలను తరిమేయ్యాలని ఎంత ప్రయత్నాలు చేసినా అవి విఫల ప్రయత్నాలు గానే మిగిలిపోతున్నాయి. అయితే ఇక్కడ అధికారులు కోతుల సమూహాలను తరిమెందుకు ఒక వినూత్నమైన ఆలోచన చేశారు. ఇక వాళ్ళు చేసిన ఆలోచన ప్రస్తుతం బాగా వర్కౌట్ అవుతుంది అని కూడా చెబుతూ ఉన్నారు. ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గత కొంతకాలంగా నూజివీడు వాసులకు కోతులు బెడదతో కంటిమీద కునుకు  లేకుండా పోతుంది.

 వందల సంఖ్యలో ఉన్న కోతుల సమూహాలు ఏకంగా గుంపులుగా వచ్చి జనావాసాల్లో తిరుగుతూ కంటికి కనిపించిన వస్తువును నాశనం చేస్తున్నాయి. ఇలా పైకప్పులను కూడా ధ్వంసం చేస్తున్నాయ్. ఇక వాటిని తరిమెందుకు ప్రయత్నించిన ఎంతోమందిని గాయపరిచాయ్ కూడా. దీంతో ఏదైనా చర్యలు చేపట్టాలి అంటూ స్థానికులు మున్సిపల్ అధికారులను కోరగా.. ఇక అధికారులు ఒక వినూత్నమైన ఆలోచన చేశారు. కోతులకు ఎలాంటి హాని చేయకుండా అటవీ ప్రాంతాలకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలనుకున్నారు. ఇద్దరు వ్యక్తులకు ఎలుగుబంటి వేషధారణ వేసి కోతలు ఎక్కువగా సంచరించే జనావాస ప్రాంతాల్లో వాటిని ఉంచారు. అయితే ఎలుగుబంటి వేసేదరణలో ఉన్న వ్యక్తులను చూసి వాటికి హాని చేయడానికి చూస్తున్నారని భయంతో కోతులు అక్కడి నుంచి పరుగులు తీస్తున్నాయ్. దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు. ఈ ఆలోచన వర్కౌట్ కావడంతో కోతుల బెడద ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ ఇదే రిపీట్ చేస్తున్నారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: