పెళ్లయింది.. ఇద్దరు పిల్లలు.. కానీ తండ్రి హిజ్రాగా మారాడు.. చివరికి?

praveen
అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చే షాకింగ్ ఘటనలు అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయని చెప్పాలి. ఈ సమాజంలో ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా అనే భావనను అందరికీ కలిగిస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవకు చెందినదే. తల్లిదండ్రులు చూపించిన అమ్మాయిని అతను పెళ్లి చేసుకున్నాడు. ఇక కొన్నాళ్లపాటు సంసారం సాఫీగానే సాగిపోయింది. ఇక దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. కానీ ఆ తర్వాత అతను అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఏకంగా ఆపరేషన్ చేయించుకుని హిజ్రాగా మారిపోయి పేరు మార్చుకొని జీవించడం మొదలు పెట్టాడు.

 అదేంటి పుట్టుకతోనే జన్యు లోపం ఉన్నవారు కదా హిజ్రాగా మారుతూ ఉంటారు. పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలను కన్న తర్వాత కూడా అతను హిజ్రాగా మారడం ఏంటి అని షాక్ అవుతున్నారు కదా. అయితే అతను ఇలా ఆపరేషన్ చేయించుకుని ట్రాన్స్ జెండర్ గా మారడానికి వెనుక ఒక పెద్ద కారణమే ఉంది. కర్ణాటకలోని రామనగర్ కు చెందిన లక్ష్మణరావు కోడి మాంసం విక్రయించే దుకాణంలో పనిచేసేవాడు. అతనికి పెద్దల సమక్షంలోనే 2015లో వివాహం జరిగింది. ఇద్దరు కుమారులు కూడా పుట్టారు. అయితే అక్కడ ఇక్కడ అప్పులు చేయడంతో అప్పుల వాళ్ళ నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో 2017 లో లక్ష్మణరావు ఇల్లు వెళ్లిపోయాడు.

 అయితే భార్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇకపోతే ఇటీవలే కన్నడ బిగ్ బాస్ షో కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చూస్తున్న సమయంలో అందులో ఒక వ్యక్తిని చూసి ఆ గృహిణి అనుమానం వచ్చింది. అక్కడ ఉన్నది తన భర్త అని అనుకుంది. దీంతో ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లింది. కాగా కన్నడ బిగ్ బాస్ షోలో నీతూ వనజాక్షి అనే హిజ్రా పాల్గొని పోటీ నుంచి బయటకు వచ్చిన ఆమెకు తృతీయ లింగ సముదాయానికి సంబంధించిన ప్రతినిధులు స్వాగతం పలికారు. ఆ సముదాయంలో కనిపించిన హిజ్రా పై గృహిణి అనుమాన పడింది. అయితే ఆమె పేరు విజయలక్ష్మి అని పోలీసు విచారణలో తెలిసింది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా.. చివరికి లింగ మార్పిడి చేసుకున్నానని అంగీకరించాడు లక్ష్మణరావు. ఇక ఈ విషయం తెలియడంతో భార్య మూర్చపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: