పెళ్లిరోజే పెగ్గేసి నిద్రపోయిన వరుడు.. చివరికి?

praveen
మద్యం ఆరోగ్యానికి హానికరం.. మద్యం తాగితే లివర్ చెడిపోతుంది. చివరికి ప్రాణం పోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ ఎందుకో మందు మానాలి అంటే మాత్రం ఎవరికీ సాధ్యం కావట్లేదు. ఇక నేటి రోజులు అయితే మద్యం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఇక నేటి రోజుల్లో ఎవరికైనా మందు అలవాటు లేదు అని చెప్పారు అంటే చాలు ఇక మిగతా జనాలు అందరూ కూడా అతన్ని కింది నుంచి మీది వరకు చిత్ర విచిత్రంగా చూడటం చేస్తూ ఉన్నారు. అలాంటి సభ్య సమాజంలో బ్రతుకుతున్నాం మనం. అయితే ఇక ఇలాంటి మందు కారణంగా ఎన్నో అనర్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడిపోయాయి. ఎన్నో రోడ్డు ప్రమాదాల్లో చాలామంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

 ఇన్ని జరుగుతున్న అటు మద్యం తాగే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. కానీ ఎక్కడ తగ్గుముఖం పట్టడం లేదు. అయితే ఇక్కడ మద్యం కారణంగా ఒక యువకుడికి పెళ్లి ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకమైనది. నచ్చిన భాగస్వామిని జీవితంలోకి ఆహ్వానించి నూరేళ్లు సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఆశపడుతూ ఉంటారు. ఇక్కడ ఒక యువకుడు అలాగే అనుకున్నాడు. కానీ మద్యం మత్తు అతనికి నిరాశ మిగిల్చింది. ఏకంగా పెళ్లి సమయంలో ఫుల్లుగా మందేసి  స్నేహితులతో కలిసి తెగ డాన్సులు చేశాడు. చివరికి మద్యం ఎక్కువై స్పృహ తప్పి పడిపోయి రాత్రంతా నిద్రలోనే ఉన్నాడు.

 పెళ్లికాకముందే ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. ఇక పెళ్లయితే నా జీవితం ఊహించుకోవడమే కష్టంగా ఉంది అనుకున్న యువతి చివరికి అతన్ని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది  దీంతో ఇలా మద్యం మత్తులో డాన్స్ చేయడమే కాదు రాత్రంతా మత్తులో నిద్రలోనే ఉండిపోయిన అతనితో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది వధువు. దీంతో వరుడుకి ఇచ్చిన కట్నం వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్లో అతనిపై కేసు కూడా పెట్టింది. ఈ ఘటన కాస్తా స్థానికంగా సంచలనగా మారిపోయింది. ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్ లో ఈ వింతైన ఘటన వెలుగులోకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: