సోషల్ మీడియా స్నేహితుడిని నమ్మింది.. చివరికి నిద్రలేచేసరికి అత్యాచారం?

praveen
ఇటీవల కాలంలో సోషల్ మీడియా అనే ఒక మాయ లోకంలోనే ప్రతి ఒక్కరు బ్రతికేస్తున్నారు. యువత అయితే మరింత ఎక్కువగా ఈ సోషల్ మీడియా మాయలో మునిగిపోతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే  స్నేహితుల దగ్గర నుంచి ప్రేమికుల వరకు అందరి పరిచయాలు కూడా సోషల్ మీడియాలోనే జరిగిపోతున్నాయి.  ఇక పక్కనే ఉన్న స్నేహితులతో మాట్లాడటం మానేసి ఎక్కడో ఉన్న స్నేహితులతో ఫోన్ లో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు అని చెప్పాలి. చివరికి ఇలాంటి సోషల్ మీడియా పరిచయాలు కొన్ని కొన్ని సార్లు ఎన్నో జీవితాలు నాశనం కావడానికి కారణంగా మారిపోతున్నాయి.

 సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న పరిచయాలు కొన్ని కొన్ని సార్లు ఏకంగా అత్యాచార ఘటనలకు కూడా కారణమవుతున్నాయి. అయితే ఇటీవలే ముంబైకి చెందిన యువతి తన విషయంలో జరిగిన ఒక దారుణ ఘటన గురించి సోషల్ మీడియాలో చెప్పడంతో నేటిజన్స్ అందరు కూడా షాక్ లో మునిగిపోయారు. హీతిక్ సింగ్ అనే యువకుడితో ఆమెకు సోషల్ మీడియా వేదికగా పరిచయం ఏర్పడింది. తరచూ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేవారు. అయితే ఓ రోజంతా అతనితో పార్టీ చేసుకోవాలని అనుకుంది యువతి. ఈ క్రమంలోనే ముంబైలో ఉన్న ఒక లోకల్ బార్ కు వెళ్లారు. అక్కడ బాగా తాగారు.

 చివరికి మత్తులో అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది. అయితే లేచి చూసేసరికి హితిక్ తనను రేప్ చేస్తున్నాడు అంటూ సదరు యువతి చెప్పుకొచ్చింది. దాంతో గట్టిగా కేకలు వేయగా.. రితిక్  చివరికి దారుణంగా దాడి చేశాడట. అయితే తర్వాత ఆమెను బయట వదిలేసి పారిపోయాడు. అయితే బాధితురాలు తన అన్నకు కాల్ చేసి జరిగిన విషయం చెప్పగా.. అతను అక్కడికి చేరుకొని ఆమెను తీసుకొని వెళ్ళాడు.  విషయం ఇంట్లో తెలియడంతో పోలీసులను ఆశ్రయించారు. ఇక ఇలా పోలీసులకు ఫిర్యాదు చేసి 15 రోజులు గడుస్తున్న పోలీసులు మాత్రం హితిక్ ను అరెస్టు చేయకపోవడం గమానార్హం. ఏంటి అని ప్రశ్నిస్తే ముందస్తు బయలు తీసుకున్నట్లు చెబుతున్నారని యువతి చెప్పుకొచ్చింది. అందుకే సోషల్ మీడియాలో ఎవరితో ఎలాంటి వారితో మాట్లాడుతున్నారు అన్న విషయంలో జాగ్రత్తగా ఉండాలని సదరు యువతి సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: