పొలం దగ్గర ఆడుకుంటున్న బాలుడు.. కానీ అంతలో?

praveen
కొన్ని దశాబ్దాల నుంచి మనుషులకి కుక్కలకి మధ్య ఎంత బలమైన బంధం కొనసాగుతూ ఉందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. విశ్వాసానికి మారు పేరైన కుక్కలను ఇక ఇంటి ఆవరణ లో పెంచుకోవడానికి ఎంతో మంది జనాలు ఇష్ట పడుతూ ఉంటారు. ఒకప్పుడు కేవలం వీధి కుక్కలు  మాత్రమే ఎక్కువగా కనిపించేవి. కానీ ఇటీవల కాలం లో మంచి బ్రీడ్ ఉన్న కుక్కలను భారీగా డబ్బులు చెల్లించి మరి.. ఇక ఇంటికి తెచ్చుకొని పెంచుకుంటున్నారు. అంతే కాదు ఇంట్లో మనిషి లాగానే ప్రేమ చూపిస్తున్నారు అని చెప్పాలి.

 ఇలాంటి సమయం  లో అటు వీధి కుక్కలు మాత్రం ఏకంగా మనుషులను చూస్తే పుట్టుక తోనే శత్రుత్వం ఉందేమో అన్నట్లుగా ప్రవర్తిస్తున్న మనిషి కనిపిస్తే చాలు ఏకంగా దారుణం గా దాడి చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత ఇక ఎక్కడైనా రోడ్డుమీద వెళ్తున్నప్పుడు కుక్కలు కనిపిస్తే చాలు వెన్నులో వణుకు పుడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇక కుక్కల దాడిలో ఎంతో మంది చిన్నారులు మరణించిన విషాదకర ఘటనలు వెలుగులోకి వచ్చాయి అన్న విషయం తెలిసిందే. ఇటీవలే కుక్కలు మరో చిన్నారి ప్రాణాన్ని బలి తీసుకున్నాయ్.

 కుక్కల దాడిలో ఏకంగా చిన్నారి ప్రాణాలు వదిలాడు. నిజాంబాద్ జిల్లా మాట్లూరు మండలం కల్లేడి లో ఈ విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. నిశాంత్ అనే ఐదు ఏళ్ల చిన్నారి డిసెంబర్ 25వ తేదీన తాతయ్యతో కలిసి పొలానికి వెళ్ళాడు. అయితే తాత ఇచ్చిన ఫోన్లో ఆడుకుంటూ ఉండగా.. కుక్క బాలుడు పై దాడి చేసింది. ఈ క్రమంలోనే తీవ్రంగా గాయపరిచింది. అయితే ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఇక రెండు రోజుల క్రితం డిశ్చార్జ్ చేయగా.. ఇక అతనికి మళ్ళీ వాంతులు అయ్యాయి. ఇక ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా చివరికి ప్రాణాలు కోల్పోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: