భార్య పురిటి నొప్పులు.. యూట్యూబ్ లో చూసి ప్రసవం చేయాలనుకున్న భర్త.. చివరికి?

praveen
ఇటీవల కాలంలో జనాలు అందరూ కూడా సోషల్ మీడియా అనే మాయలో మునిగితేలుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టేసి ఇక సోషల్ మీడియాను వాడటం చేస్తూ ఉన్నారు. ఇక ఈ సోషల్ మీడియా వల్ల ఇక ఎన్నో కొత్త విషయాలను కూడా తెలుసుకుంటున్నారు. ఇలాంటిది మంచిదే. కానీ కొంతమంది సోషల్ మీడియా వాడకంలో మునిగిపోయి చేయకూడని పిచ్చి పనులు కూడా చేస్తూ ఉన్నారు. ఏకంగా సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ తెలుసుకొని సొంత వైద్యం చేసుకుంటున్నా జనాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నారు. కొంతమంది ఇలాంటి పిచ్చి పనులు చేసి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.

 ఏకంగా యూట్యూబ్లో చూసి ప్రసవం చేసిన ఘటనలు ఇప్పటివరకు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు వెలుగు చూసిన ఘటన కూడా ఇలాంటి కొవలోకి చెందినదే. ఏకంగా పురిటి నొప్పులు వచ్చిన భార్యకు యూట్యూబ్లో చూసి భర్త ప్రసవం చేసేందుకు ప్రయత్నించాడు. కానీ చివరికి తీవ్ర రక్తస్రావమై మహిళ మరణించింది. ఈ ఘటన తమిళనాడు లోని కృష్ణగిరి జిల్లా హనుమంతపురంలో వెలుగు చూసింది. పోచంపల్లి సమీపంలోని పులియంపట్టికి చెందిన వేడిఅప్పన్ కూతురు లోకనాయకికి మాదేశ్ తో వివాహం జరిగింది. ఇద్దరు అగ్రికల్చర్ కోర్సులో డిగ్రీ చేశారు.

 అయితే ఇటీవలే లోకనాయకి గర్భం దాల్చింది. కాగా ఇంటి వద్ద సహజసిద్దంగా ప్రసవం చేయాలని భార్యాభర్తలిద్దరూ నిర్ణయించుకున్నారు. అందుకోసం కొన్ని నెలల నుంచి ఇద్దరు కూడా యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ఉండేవారు. అయితే ఇటీవలే లోకనాయకికి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో మాదేష్ ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ముందుగా అనుకున్న ప్రకారమే యూట్యూబ్లో వీడియోలు చూస్తూ కాన్పు చేసేందుకు ప్రయత్నించాడు. అయితే ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. కానీ తీవ్ర రక్తస్రావం కావడంతో కోమలోకి వెళ్లిన తర్వాత ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. పరీక్షించిన వైద్యులు ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: