విధి ఆడిన నాటకం.. వేరుశనగ గొంతులో ఇరుక్కుని?

praveen
సాధారణంగా తల్లి కడుపు నుంచి బయటకు వచ్చాక వృద్ధాప్యం వస్తేనో లేదంటే ఒక పెద్ద ఆరోగ్య సమస్య వస్తేనో ప్రాణాలు పోయేవి అని అందరూ నమ్మేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఎవరు ఇలా అనుకోవట్లేదు. ఒక్కసారి తల్లి కడుపు నుంచి బయటికి వచ్చాక ప్రాణాలు ఎప్పుడు పోతాయో అన్నది కూడా చెప్పలేని విధంగా మారిపోయింది అని అనుకుంటున్నారు. కారణం నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలే. విధి ఆడే నాటకంలో మనుషులు జీవితాలు కీలు బొమ్మలు అని పెద్దలు చెప్పిన మాట  ముమ్మాటికి నిజమే అని నిరూపించే ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.


 ఎందుకంటే అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో ఊహించని ఘటనలు చివరికి ప్రాణాలు తీస్తూ ఎన్నో కుటుంబాలలో విషాదాన్ని నింపుతూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే అభం శుభం తెలియని చిన్నారుల విషయంలో కూడా విధి ఎంతో కఠినంగానే వ్యవహరిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇంకా ఈ లోకాన్ని కూడా సరిగ్గా అర్థం చేసుకోలేని చిన్నారులు.. అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. ఇక్కడ వెలుగులోకి వచ్చిన విషాదకర ఘటన కూడా ఈ కోవలోకి చెందినదే. సాధారణంగా చిన్నపిల్లలు అన్న తర్వాత సరదాగా వేరుశనగలను తినడం చేస్తూ ఉంటారు.


 అయితే ఇలా వేరుశనగలు తినాలనే ఆశ ఆ చిన్నారి ప్రాణాన్ని తీసేసింది. వేరుశెనగ విత్తనం గొంతులో ఇరుక్కుని రెండేళ్ల పాప ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లాలో వెలుగు చూసింది. నల్ల చెరువుకు హనుమంతు అనే వ్యక్తికి 2 ఏళ్ళ కూతురు నయశ్రీ ఉంది. అయితే ఇటీవల  ఆడుకుంటూ వేరుశనగ విత్తనాన్ని నోట్లో పెట్టుకుంది. అయితే దురదృష్టవశాత్తు అది గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక చిన్నారి విలవిలలాడిపోయింది.  ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురుని విగత జీవిగా చూసి కన్నీరు మున్నీరయ్యారు తల్లిదండ్రులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: