శివయ్యే తీర్పును మార్చాడా.. కోర్టులో ఆసక్తికర ఘటన?
ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇటీవల కాలంలో కోర్టులు ఇచ్చే తీర్పులు మాత్రం సంచలనగా మారిపోతున్నాయి అని చెప్పాలి. ఎప్పటికప్పుడు చిత్ర విచిత్రమైన కేసులు అటు కోర్టు మెట్లు ఎక్కుతూ ఉండడం.. ఇక ఆ తర్వాత ఆ కేసులపై విచారణ జరిపి అనంతరం న్యాయస్థానాలు ఇస్తున్న తీర్పులు అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా ఆధారాల అనుగుణంగా కాకుండా కోర్టులో జరిగిన ఒక అనూహ్య ఘటన ఆధారంగా జడ్జి తీర్పు మార్చడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఈ ఘటన కోల్కతా హైకోర్టులో జరిగింది అని చెప్పాలి. సుదీప్, గోవింద్ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక స్థలం విషయంలో వివాదం నడుస్తుంది. అయితే సుదీప్ ఆ స్థలంలో శివలింగాన్ని ఏర్పాటు చేశాడు. అయితే గోవిందు హైకోర్టును ఆశ్రయించాడు. ఇక ఈ విషయంపై కోర్టు విచారణ జరిపి వాదోపవాదాలు విన్నది. అయితే ఆ తర్వాత జడ్జి జస్టిస్ గుప్తా విచారణ చేపట్టి ఆ స్థలంలోని శివలింగాన్ని తొలగించాలి అంటూ తీర్పు చెప్పాడు. ఇక ఆ సమయంలోనే ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆ తీర్పును నమోదు చేస్తున్న అసిస్టెంట్ రిజిస్టర్ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో అంతా శివయ్య చేశాడు అనుకున్నాడో ఇంకేంటో కానీ వెంటనే తీర్పును మారుస్తూ నిర్ణయం తీసుకున్నాడు జడ్జి జస్టిస్ గుప్తా.