కూతురుపై అత్యాచారం చేసిన తండ్రికి.. కోర్టు ఏం శిక్ష వేసిందంటే?
అయితే మొన్నటి వరకు బయటకు వెళ్ళినప్పుడు ఆకతాయిల నుంచి వేధింపులు ఎదురవుతే.. ఇక ఆ వేదింపుల నుంచి బయటపడేయాలి అంటూ బాధను ఇంట్లో వాళ్లకు చెప్పుకునే వారు ఆడపిల్లలు. కానీ ఇటీవల కాలంలో వావి వారసులు మరిచిపోయి ఏకంగా సొంత ఇంటి వారే అత్యాచారాలు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక.. ఆడపిల్లలు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు అని చెప్పాలి. కంటికి రెప్పల కాచుకోవాల్సిన తండ్రి నీచమైన ఆలోచనతో అత్యాచారాలు.. చేస్తున్న ఘటనలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి.
అయితే ఇలా రక్తం పంచుకొని పుట్టిన కూతురు పైనే అత్యాచారం చేసిన తండ్రికి ఇక్కడ ఒక కోర్టు కఠిన శిక్ష విధించింది. ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పును ఇచ్చింది మల్కాజ్గిరి అడిషనల్ స్పెషల్ పోక్సో కోర్టు హైదరాబాద్ లోని మౌలాలి లక్ష్మీ నగర్ వాసి రాజు 2019లో తన రెండవ కూతురిపై అత్యాచారానికి పాల్పడుతూ భార్యకు కనిపించాడు. ఆగ్రహంతో ఊగిపోయిన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించి పూర్తి ఆధారాలతో కోర్టు ముందు ప్రవేశపెట్టారు. కాగా కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది.