సంఘీ టెంపుల్ కు వచ్చిన ప్రేమ జంట.. దర్శనం కోసం అనుకుంటే ఏం చేశారో తెలుసా?

praveen
ఇటీవల కాలంలో యువతీ యువకుల మధ్య పడుతున్న ప్రేమ చివరికి విషాదంగానే ముగుస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. ఎందుకంటే ప్రేమను గెలిపించుకోలేకపోతున్నామని కొంతమంది.  ఇక తమ పెళ్ళికి పెద్దలు ఒప్పుకుంటారో లేదో అని ఇంకొంతమంది మనస్థాపంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయితే కొన్ని కొన్ని సార్లు పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటే కులాంతర మతాంతర వివాహం చేసుకున్నారు అంటూ కని పెంచిన తల్లిదండ్రులే దారుణంగా హత్యలు చేస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.

 వెరసి ఇటీవల కాలంలో ప్రతి ప్రేమ కథ చివరికి విషాదకథ గానే ముగుస్తుంది అని చెప్పాలి. ఇక్కడ ప్రేమ జంట చేసిన పనికి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. వారిద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇక కలకాలం సంతోషంగా ఉండాలని ఎన్నో కలలు కన్నారు. కానీ వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో కలిసి బ్రతకలేమేమో అనే ఆందోళన చెందారు. కలిసి బ్రతకలేం కనీసం చావులో అయినా కలిసి ఉండాలి అనుకున్నారు. చివరికి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.

 సరూర్నగర్ కు చెందిన శ్రీధర్ రామంతపూర్ కు చెందిన సుప్రియల మధ్య స్నేహం మొదలై ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. ఇదే విషయంపై పెద్దలకు చెప్పారు. కానీ పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించలేదు. చివరికి కలిసి చనిపోవాలి అనే నిర్ణయించుకుంది ఈ ప్రేమ జంట. ఈ క్రమంలోనే అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సంఘీ టెంపుల్ వద్దకు వచ్చారు. వస్తూ వస్తూ పురుగుల మందు తమ వెంట తెచ్చుకున్నారు. ఇక తర్వాత ఉమర్ఖాన్ సమీపంలో పురుగుల మందును సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అపస్మారక స్థితిలోకి చేరుకున్న ఇద్దరిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వెంటనే వీరిని ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: