బర్త్ డే.. జొమాటో డెలివరీ బాయ్ ఏం చేశాడో తెలుసా?

praveen
ఇటీవల కాలంలో టెక్నాలజీ కారణంగా మనిషికి ప్రతి ఒక్కటి కూడా ఇంటి ముంగిటికి వచ్చే పరిస్థితి ఏర్పడింది. దీంతో అటు సామాన్యుడు సైతం సంపన్నుడి లాగా.. ఇంట్లో కూర్చుని అన్ని వస్తువులను ఇంటి ముంగిటికి తెప్పించుకోగలుగుతున్నాడు అని చెప్పాలి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఆహారాన్ని కూడా డెలివరీ చేసేందుకు ఎన్నో కంపెనీలు అందుబాటులో ఉన్నాయి. స్విగ్గి, జొమాటో అంటూ ఎన్నో కంపెనీలు ఆర్డర్ చేసిన నిమిషాల్లోనే చివరికి ఆహారాన్ని కస్టమర్ దగ్గరికి చేరుస్తూ ఉన్నాయి అని చెప్పాలి.


 ఇలాంటి సర్వీస్ లకు బాగా అలవాటు పడిపోయిన జనాలు ఇక రెస్టారెంట్ కు వెళ్లి తమకు కావలసిన ఆహారం తీసుకోవడం అంటే అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో ఒక్క క్లిక్ తో ఆర్డర్ చేసి ఇంటి ముంగిటికీ కావాల్సిన ఫుడ్ తెప్పించుకోగలుగుతున్నారు. ఇక ఇటీవల కాలంలో జొమాటో అయితే ఇలా కస్టమర్లకు మెరుగైన సర్వీస్ లు అందిస్తుంది. ఇక ఎంతోమంది నిరుద్యోగులు సైతం జోమాటో లో ఫుడ్ డెలివరీ బాయ్స్ గా పని చేస్తూ ఇక భారీగానే ఆదాయం పొందుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవలే ఒక జొమాటో డెలివరీ బాయ్ కి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.


 కనీసం తినడానికి టైం కూడా లేనంతగా జొమాటో డెలివరీ బాయ్స్ కష్టపడుతూ ఉంటారు అన్న దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎన్నో ప్రత్యక్షమయ్యాయి. ఇక్కడ ఒక డెలివరీ బాయ్ కూడా తన పుట్టినరోజు ఉన్నప్పటికీ విధి నిర్వహణలో నిమగ్నమయ్యాడు. అయితే తాను చేస్తున్న పనిలోనే సంతోషాన్ని వెతుక్కున్నాడు. పని చేస్తూనే పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. ఈ క్రమంలోనే ముంబైకి చెందిన కరన్ ఇటీవల తన పుట్టినరోజును జరుపుకోవాలని ఫుడ్ డెలివరీ చేసిన ప్రతి ఇంటికి చాక్లెట్లు పంచాడు. ఈ విషయాన్ని ఫ్రెండ్ కి చెప్పుగా వారిలో కొందరు ఈ విషయాన్ని జొమాటోతో ట్యాగ్ చేశారు. దీంతో జొమాటో అతనికి కేక్ పంపింది. దీంతో అతను కంపెనీకి థాంక్స్ చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: