అల్లుడితో అక్రమ సంబంధం.. నిలదీసిన భర్త.. చివరికి?

praveen
ఏంటో నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత సభ్య సమాజం తీరు ఎటు పోతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే టెక్నాలజీ యుగంలోకి అడుగుపెడుతున్న మనిషి ఎందుకో మానవ బంధాలకు మాత్రం విలువ ఇవ్వడం మర్చిపోతున్నాడు. ఏకంగా క్షణకాల సుఖం కోసం నీచాతి నిజమైన పనులు చేసినందుకు కూడా మనిషి సిద్ధమైపోతూ ఉండడం చూస్తూ ఉన్నాం. అక్రమ సంబంధాల పేరుతో ఏకంగా కట్టుకున్న బంధానికి సైతం విలువ ఇవ్వడం లేదు. అదే సమయంలో ఇక పరాయి వ్యక్తుల మోజులో పడిపోయి కట్టుకున్న వారిని సైతం దారుణంగా హత మారుస్తున్న ఘటనలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి అని చెప్పాలి.

 అక్రమ సంబంధం పెట్టుకోవడం ఇక పెళ్లి అనే బంధానికి విలువ ఇవ్వకుండా కట్టుకున్న వారిని మోసం చేయడం తప్పు అని తెలిసినప్పటికీ.. ఎంతోమంది అక్రమ సంబంధం మాయలో పడిపోయి దారుణాలకు పాల్పడుతున్నారు అని చెప్పాలి. అయితే ఇలా అక్రమ సంబంధాలు నేపథ్యంలో హత్యలు ఆత్మహత్యలు పెరిగిపోతున్న.. ఎవరిలో మార్పు రావడం లేదు. ఇక ఇటీవల హైదరాబాద్ నగరంలో కూడా అక్రమ సంబంధం కారణంగా ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. రాసలీలలకు తెరలేపిన మహిళ చివరికి కట్టుకున్న భర్తను హత్య చేసేందుకు కూడా సిద్ధపడింది.

 వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది మహిళ. అయితే ఈ ఘటనకు సంబంధించి కోర్టులో విచారణ జరిగింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే భర్తను హత్య చేసిన నిందితురాలికి యావజ్జీవ శిక్షతోపాటు వేయి రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఎల్బీనగర్ కు చెందిన ప్రవళిక, పుల్లయ్య దంపతులు.. అయితే పుల్లయ్య మేనల్లుడుతో ప్రవళికకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం పుల్లయ్యకు తెలియడంటూ భార్యను నిలదీస్తాడు. దీంతో అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భార్య అతన్ని హత మార్చింది. చివరికి నేరం రుజువు కావడంతో కోర్టు శిక్ష వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: